Telugu Global
Science and Technology

Vivo Y16, Y56 Discounts | వివో వై56.. వివో వై16ల‌పై బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. భారీగా ధ‌ర‌లు త‌గ్గించిన వివో..!

Vivo Y16, Y56 Discounts | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వై56, వై16 ఫోన్ల‌పై భారీగా ధ‌ర‌లు త‌గ్గించేసింది. ఇన్‌స్టంట్ క్యాష్ డిస్కౌంట్ రూ.1000తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై రాయితీలు అందిస్తోంది.

Vivo Y16, Y56 Discounts | వివో వై56.. వివో వై16ల‌పై బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. భారీగా ధ‌ర‌లు త‌గ్గించిన వివో..!
X

Vivo Y16 , Y56 Discounts | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో వై56 (Vivo Y56), వివో వై16 (Vivo Y16) ఫోన్ల‌పై భార‌త్ మార్కెట్ల‌లో ధ‌ర‌లు భారీగా త‌గ్గించేసింది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో వివో వై16 (Vivo Y16), గ‌త ఫిబ్ర‌వ‌రిలో వివో వై56 (Vivo Y56) ఆవిష్క‌రించింది. వివో వై 56 ఫోన్ 19 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌, వివో వై16 ఫోన్ 5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ, మీడియాటెక్ హెలియో పీ35 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. వివో వై16 ఫోన్ రెండు స్టోరేజీ ఆప్ష‌న్లు, వివో వై56 ఫోన్ సింగిల్ స్టోరేజీ ఆప్ష‌న్‌లో ల‌భిస్తుంది.

వివో వై56.. వివో వై16 ఫోన్ల ధ‌ర‌లు ఇలా

వివో వై56 ఫోన్ 8 జీబీ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.19,999 కాగా, రూ.1000 డిస్కౌంట్‌తో రూ.18,999ల‌కు ల‌భిస్తుంది. ఇది బ్లాక్ ఇంజిన్‌, ఆరంజ్ షిమ్మ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ.2000 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ల‌భిస్తాయి.

ధ‌ర త‌గ్గింపుతో వివో వై16 ఫోన్ బేస్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.10,999ల‌కు ల‌భిస్తుంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధ‌ర రూ.12,999ల‌కు అందుబాటులో ఉంటుంది. డ్రిజ్లింగ్ గోల్డ్‌, స్టెల్లార్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల‌పై అద‌నంగా రూ.2000 డిస్కౌంట్‌, రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అందిస్తుంది.

వివో వై56 స్పెషిఫికేష‌న్స్‌

వివో వై 56 ఫోన్ 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1082x2408 పిక్సెల్‌) ఎల్‌సీడీ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తున్నది. దీని రామ్ 8 జీబీ రామ్ కాగా, వ‌ర్చువ‌ల్‌గా 16 జీబీ రామ్ వ‌ర‌కూ పొడిగించ‌వ‌చ్చు. 128 జీబీ రామ్ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్ష‌న్ ఉంటుంది.

వివో వై56 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండ‌రీ సెన్స‌ర్ కెమెరాల‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్... సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో కూడిన 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది. వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్‌, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

వివో వై16 స్పెషిఫికేష‌న్స్‌

వివో వై16 ఫోన్ 6.51-అంగుళాల హెచ్‌డీ+ (1600x720 పిక్సెల్స్‌) ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ డిస్‌ప్లే ఉంటుంది. మీడియా టెక్ హేలియో పీ35 ఎస్వోసీ ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటుంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తుంది. డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ గ‌ల వివో వై16 ఫోన్ 13-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండ‌రీ సెన్స‌ర్ కెమెరాతోపాటు డ్యుయ‌ల్ రేర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఆప్ష‌న్ ఇచ్చారు. వివో వై16 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ అండ్‌ స్క్రాచ్ రెసిస్టెంట్ మెటీరియ‌ల్‌తో కూడిన గ్లాస్ త‌ర‌హా ప్యానెల్ ఏర్పాటు చేశారు.

First Published:  15 Aug 2023 6:15 AM GMT
Next Story