Telugu Global
Science and Technology

త్వరలో రాబోతున్న బెస్ట్ మొబైల్స్ ఇవే...

రియల్ మీ, నోకియా, శాంసంగ్, రెడ్ మీ నుంచి కొత్త మొబైల్స్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. బడ్జెట్ ధరల్లో బెస్ట్ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్స్ ఇవి.

Upcoming Smartphones in November 2022
X

రియల్ మీ, నోకియా, శాంసంగ్, రెడ్ మీ నుంచి కొత్త మొబైల్స్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. బడ్జెట్ ధరల్లో బెస్ట్ ఫీచర్స్ ఉండే స్మార్ట్‌ఫోన్స్ ఇవి. ఈ మొబైళ్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్ మీ 10 సిరీస్

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రియల్‌మీ వరుసగా మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తోంది. తాజాగా 10 సిరీస్‌ నుంచి రెండు మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రియల్‌మీ10 ప్రో, రియల్‌మీ 10 ప్రో+ పేరుతో కొత్త మొబైల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. రియల్‌మీ 10ప్రో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌తో వస్తుంది.33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇందులో 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 ఎంపీ వెనుక కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండబోతుంది.

ఇక రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 65 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4890 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. రియల్‌మీ 10 సిరీస్‌ ఫోన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండొచ్చు.

శాంసంగ్ ఏ సిరీస్

సౌత్ కొరియన్ మొబైల్ కంపెనీ శాంసంగ్ తమ గెలాక్సీ-ఏ సిరీస్ నుంచి కొత్తగా 'ఏ14 (A14)' స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతుంది. ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చి తర్వాత భారత మార్కెట్లోకి వస్తుంది. ఇది శాంసంగ్ బడ్జెట్ రేంజ్ మొబైల్. దీన ధర రూ. 10వేల నుంచి రూ. 15వేల మధ్య ఉండొచ్చు.

శాంసంగ్ ఏ14 స్మార్ట్‌ఫోన్ 4జీ నెట్‌వర్క్‌తో పనిచేస్తుది.ఇది మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. బేస్ మోడల్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ వెనుక కెమెరా, 13-ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి.

నోకియా

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన మొబైల్ బ్రాండ్ నోకియా కొంతకాలంగా ఇండియన్ మార్కెట్‌లో కనిపించడం లేదు. అయితే ఇప్పుడు తన సరికొత్త 5జీ ఫోన్‌తో రీఎంట్రీ ఇవ్వబోతోంది. భారత మార్కెట్లో నోకియా త్వరలో జీ60 (G60) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 20వేల లోపు ఉండొచ్చు. ఇది స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే ఉండబోతుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది. వెనుక భాగంలో 50-ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమరా ఉంటాయి. 20వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

రెడ్‌ మీ 12

ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ షావోమీ.. తమ రెడ్ మీ 12 సిరీస్‌ను ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ఇందులో 120వాట్ హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని టాక్. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా ఇందులో హైలైట్‌గా ఉండనుంది. ఈ మొబైల్ ధర రూ. 30వేల లోపు ఉంటుందని అంచనా.

First Published:  4 Nov 2022 10:30 AM GMT
Next Story