Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లివే..

వచ్చే ఏడాదిలో వాట్సాప్ యాప్ , డెస్క్‌టాప్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్ రానున్నాయి. ఇందులో డిలిటెడ్ మెసేజ్‌ల‌ను అన్‌డూ చేయ‌డం, స్టేట‌స్‌ల‌పై రిపోర్ట్ చేయడం, లాగిన్ కోడ్స్ లాంటి ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

WhatsApp new features
X

వాట్సాప్ ఫీచర్లు

వచ్చే ఏడాదిలో వాట్సాప్ యాప్ , డెస్క్‌టాప్‌కు సంబంధించి కొన్ని కొత్త అప్‌డేట్స్ రానున్నాయి. ఇందులో డిలిటెడ్ మెసేజ్‌ల‌ను అన్‌డూ చేయ‌డం, స్టేట‌స్‌ల‌పై రిపోర్ట్ చేయడం, లాగిన్ కోడ్స్ లాంటి ఫీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ల ప్రత్యేకత ఏంటంటే..

సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎవరికైనా ఇబ్బంది కలిగించేలా ఉంటే వెంటనే వాటిని రిపోర్ట్ చేసే వీలుంటుంది. దీంతో సోషల్ మీడియా యాజమాన్యం అలాంటి పోస్ట్‌లను రివ్యూ చేసి వాటికి అడ్డుకట్ట వేసే వీలుంటుంది. అయితే వాట్సాప్‌లో పెట్టే రకరకాల స్టేటస్‌లకు ఈ రిపోర్ట్ ఫీచర్ లేదు. అందుకే వాట్సాప్ కొత్తగా స్టేటస్‌ లకు రిపోర్ట్ చేసే ఫీచర్ తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా అసభ్యకరంగా ఉండే స్టేట‌స్‌ల గురించి వాట్సాప్ టీమ్‌కు రిపోర్ట్ చేయొచ్చు.

వాట్సాప్ త్వరలో తీసుకురాబోతున్న మరో ఫీచర్ లాగిన్ కోడ్. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు మ‌రో డివైజ్‌లో త‌మ వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ కావాలంటే ఆరు డిజిట్ల కోడ్ న‌మోదు చేయాల్సి ఉంటుంది. యూజర్ల ప్రైవసీ మరింత సేఫ్‌గా ఉండేందుకు వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకొస్తోంది.

వాట్సాప్ మెసేజ్‌లో ఏవైనా త‌ప్పులు దొర్లితే దాన్ని ఎవరూ చూసే వీలు లేకుండా వెంటనే 'డిలీట్ ఫ‌ర్ ఎవిరీ వ‌న్‌' చేయొచ్చు. ఒకవేళ పొరపాటున అది నొక్కబోయి 'డిలిట్ ఫ‌ర్ మీ' నొక్కితే మాత్రం ఆ మెసేజ్ మనకు తప్ప అందిరికీ కనిపిస్తుంది. ఇక ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశమే లేదు. ఈ సమస్యకు సొల్యూషన్‌ గా మెసేజ్‌ల‌ను 'అన్‌డూ' చేసే ఆప్షన్ తీసుకురాబోతుంది వాట్సాప్. ఇక వీటితో పాటు వాట్సాప్ స్టేట‌స్ ప్రైవ‌సీ సెట్టింగ్స్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, ఆఫీస్ అనే కొన్ని కేటగిరీలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

First Published:  28 Dec 2022 5:00 AM GMT
Next Story