Telugu Global
Science and Technology

మార్కెట్లో బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్స్ ఇవే!

మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ చాలానే ఉన్నాయి.

Fastest charging smartphones in India: మార్కెట్లో బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్స్ ఇవే!
X

Fastest charging smartphones in India: మార్కెట్లో బెస్ట్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్స్ ఇవే!

టైం పాస్ కోసం మొబైల్ వాడే వాళ్ల సంగతి అటుంచితే వృత్తి పనిలో భాగంగా రోజంతా మొబైల్ వాడేవాళ్లు చాలామందే ఉంటారు. ఇలాంటి వాళ్లకు మొబైల్ ఛార్జింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. వెంటనే బ్యాటరీ అయిపోవడం, ఛార్జ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల రోజువారీ పనులు ఆగిపోతాయి. అందుకే ఇలాంటి వాళ్లకోసం ఫాస్ట్ చార్జింగ్ ఫోన్స్ పుట్టుకొచ్చాయి. నిముషాల్లో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయగలగడం వీటి ప్రత్యేకత. మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ మొబైల్స్ ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22 అల్ట్రా: 5000ఎంఎహెచ్‌ బ్యాటరీతో పనిచేసే ఈ మొబైల్.. 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ గంటలో మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుంది. పావుగంటలో 50 శాతం బ్యాటరీ నిండుతుంది. దీని ధర రూ.91,000 ఉంది.

రియల్ మీ జి‌టి నియో 5: ఈ మొబైల్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. వచ్చే నెలలో రిలీజయ్యే ఈ మొబైల్.. ఏకంగా 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం నిముషాల్లో మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుంది.

రెడ్‌మీ నోట్‌ 12 ప్రొ ప్లస్‌: 4980ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ మొబైల్.. 120 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 100 శాతం చార్జింగ్‌ కేవలం అరగంటలో పూర్తవుతుంది. దీని ధర రూ.29,999 ఉంది.

ఒప్పో రెనో 8ప్రొ 5జీ: 4500ఎంఎహెచ్‌ బ్యాటరీతో పనిచేసే ఈ మొబైల్ 80 వాట్ సూపర్‌వూక్‌ చార్జింగ్‌కు సపొర్ట్ చేస్తుంది. కేవలం అరగంటలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.49,990 ఉంది.

రియల్‌మీ 10 ప్రొ ప్లస్‌ 5జి: 5000ఎంఎహెచ్‌ బ్యాటరీ ఉండే ఈ మొబైల్.. 67 వాట్ సూపర్‌వూక్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 50 నిముషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీని ధర రూ.24,999 ఉంది.

ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే చార్జింగ్ పెట్టినప్పుడు గేమ్స్‌ ఆడడం, ఫోన్లు మాట్లాడడం లాంటివి చేయకూడదు. అలాగే ఫోన్‌ చార్జింగ్ పెట్టినప్పుడు వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేయాలి. ఛార్జ్ చేసేందుకు సాధ్యమైనంత వరకు ఒరిజినల్ అడాప్టర్, కేబుల్‌నే వాడాలి. అలాగే తరచూ ఫోన్‌కు చార్జింగ్ పెట్టడం కూడా మంచిది కాదు. ఒకేసారి కనీసం 50శాతమైనా చార్జ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు వల్ల బ్యాటరీ ఎక్కువకాలం పాటు మంచిగా పనిచేసే వీలుంటుంది.

First Published:  27 Jan 2023 11:08 AM GMT
Next Story