Telugu Global
Science and Technology

ఎలాన్ మస్క్ కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇదే..

టెస్లా, స్పేస్ ఎక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలాన్‌ మస్క్‌ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాడు. అసలీ ఫోన్‌ ఎలా ఉండబోతుందంటే..

ఎలాన్ మస్క్ కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇదే..
X

టెస్లా, స్పేస్ ఎక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలాన్‌ మస్క్‌ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాడు. అసలీ ఫోన్‌ ఎలా ఉండబోతుందంటే..

ఎలాన్ మస్క్‌ ఏం చేసినా ప్రత్యేకమే. అందుకే ఆయన స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను అనౌన్స్ చేస్తున్నాడనగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాన్ మస్క్ ఇప్పటికే టెస్లా, స్పేస్‌ ఎక్స్‌, స్టార్‌లింక్‌, న్యూరాలింక్‌, ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలను స్థాపించి సరికొత్త ఇన్నోవేష్లకు తెరలేపాడు. తాజాగా బార్ట్న్‌ హెయిల్ పేరుతో పెర్‌ఫ్యూమ్‌ అమ్మకాలు కూడా మొదలుపెట్టాడు. అయితే ఈ ఏడాది చివర్లో ఎలాన్‌ మస్క్‌ కొత్తగా స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోని అడుగుపెట్టబోతునట్టు వార్తలొస్తున్నాయి.

ఎలాన్ మస్క్ తీసుకురాబోతున్న కొత్త మొబైల్ పేరు 'పై ఫోన్' అని టాక్. ఇందులో 120 రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం. దీనికి ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుందట.

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలుంటాయి. వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలు, ముందువైపు 40 ఎంపీ పంచ్‌హోల్ కెమెరా ఉండొచ్చు. ఈ ఫోన్ కోసం టెస్లా సొంతంగా కొత్త జనరేషన్ ప్రాసెసర్‌ను తయారుచేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

అలాగే ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చంటున్నారు. ఈ ఫోన్ ధర రూ. 70 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండొచ్చని టెక్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇందులో స్టార్‌‌లింక్ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ ఉంటుందా అనేది ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్. అలాగే ఇందులో వాడే ఓఎస్ గురించి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుందా? లేక టెస్లా సొంత ఓఎస్‌ను డెవలప్‌ చేస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబరు వరకు వెయిట్ చేయాల్సిందే.

First Published:  20 Oct 2022 6:00 AM GMT
Next Story