Telugu Global
Science and Technology

టెక్నో పోవా 6 ప్రో.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో నుంచి ‘టెక్నో పోవా6 ప్రో 5జీ’ పేరుతో మిడ్‌రేంజ్ పెర్ఫామెన్స్ ఫోన్ రిలీజయింది.

టెక్నో పోవా 6 ప్రో.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!
X

టెక్నో పోవా 6 ప్రో.. మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

గత నెలలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ‘టెక్నో పోవా 6 ప్రో 5జీ’ మొబైల్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో రిలీజయింది. ఈ ఫోన్ ఫీచర్లు, ప్రత్యేకతల వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో నుంచి ‘టెక్నో పోవా6 ప్రో 5జీ’ పేరుతో మిడ్‌రేంజ్ పెర్ఫామెన్స్ ఫోన్ రిలీజయింది. ఇది 6 ఎన్ఎం టెక్నాలజీతో రూపొందించిన మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌ వెర్షన్‌పై రన్ అవుతుంది.

టెక్నో పోవా6 ప్రో 5జీ మొబైల్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ, 0.08 ఎంపీ డెప్త్ సెన్సర్‌‌లున్నాయి. ప్రైమరీ సెన్సర్ 3ఎక్స్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ముందు వెనుకా డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌లు కూడా ఉన్నాయి.

టెక్నో పోవా6 ప్రో 5జీ మొబైల్‌లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది 70వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 5జీ, వై-ఫై 5.0, బ్లూటూత్5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ, ఐపీ 53 స్ప్లాష్ ప్రూఫ్, డ్యుయల్ నానో సిమ్, డాల్బీ అట్మాస్ స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లున్నాయి. ధరల విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999గా ఉన్నాయి. కామెట్ గ్రీన్, మీటరైట్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

First Published:  3 April 2024 1:00 AM GMT
Next Story