Telugu Global
Science and Technology

సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయొద్దు!

ఈ రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ లేని మొబైల్ కనిపించడం చాలా అరుదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్).. ఇలా ప్రతిఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడయాను వాడుతుంటారు.

సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయొద్దు!
X

సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయొద్దు!

ఈ రోజుల్లో సోషల్ మీడియా యాప్స్ లేని మొబైల్ కనిపించడం చాలా అరుదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్).. ఇలా ప్రతిఒక్కరూ ఏదో ఒక సోషల్ మీడయాను వాడుతుంటారు. అయితే ప్రైవసీ అంగట్లో సరుకుగా మారిన ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడేవాళ్లంతా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఎఫ్‌బీ పోస్ట్‌లు, ఎక్స్(ట్విటర్‌)లో కామెంట్లు, ఇన్‌స్టాలో ఫాలో అయ్యే పేజీలు.. ఇలా వ్యక్తిగత ఇంట్రెస్ట్‌లను బట్టి వాళ్లేంటో ఇట్టే పసిగట్టే రోజులివి. కాబట్టి కంటికి కనిపించని సోషల్ మీడియా వలలో చిక్కకూడదంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటించాల్సిందే.

సోషల్‌ మీడియాలో చేసే పోస్ట్ అయినా, కామెంట్ అయినా.. ఒక్కసారి ఫోన్ దాటితే నిముషాల్లో ప్రపంచమంతా వైరల్ అవ్వొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం అవసరం.

సోషల్ మీడియా అనేది పబ్లిక్ మార్కెట్ వంటిది. కాబట్టి పర్సనల్ విషయాలను అతిగా షేర్‌ చేయకపోవడమే మంచిది. వ్యక్తిగత విషయాలను ఇతరుల పసిగట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తొచ్చు.

ఒక తప్పుడు వార్త కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలు కూడా తీయొచ్చు. కాబట్టి నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఏ పోస్టూ చేయొద్దు. విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టుల వల్ల చాలా ఇబ్బందులుంటాయి. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టే వైరల్ వార్తలు నిజమైనవా? లేదా ఫేక్ న్యూసా? అన్నది తెలుసుకునేందుకు ‘ఫ్యాక్ట్‌లీ’, ‘బూమ్‌లైవ్’ వంటి వెబ్‌సైట్స్ చూడొచ్చు.

మెసేజింగ్‌ యాప్స్‌లో పర్సనల్ విషయాలు చర్చిస్తుంటారు. కాబట్టి ఆ యాప్స్‌కు ‘ఎండ్‌ టు ఎండ్‌’ ఎన్‌స్క్రిప్షన్‌ ఉందో లేదో చూసుకోవాలి. వాట్సాప్, ఇన్‌స్టా, టెలిగ్రామ్ యాప్స్ వాడేవాళ్లకు ఆ సమస్య లేదు. అలాగే మెసేజింగ్ యాప్స్ లాగిన్‌ చేసేందుకు టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పెట్టుకోవాలి.

అన్ని సోషల్‌ మీడియా అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ కాకుండా వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. అలాగే ఫోన్‌ హోమ్‌ స్క్రీన్‌పై ఎలాంటి సోషల్ మీడియా యాప్స్‌ లేకుండా చూసుకుంటే మంచిది.

మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ట్యాగ్‌ చేస్తే వెంటనే ట్యాగ్ రిమూవ్ చేయాలి. అలాగే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ట్యాగ్గింగ్ పర్మిషన్స్ ఆప్షన్ మార్చుకోవాలి.

చివరిగా సోషల్‌ మీడియా వాడకానికి ఎంత తక్కువ టైం కేటాయిస్తే అంత మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు స్మార్ట్‌ఫోన్‌ కన్నా.. డెస్క్‌టాప్‌, ల్యాప్‌ట్యాప్ వంటివి సేఫ్ ఆప్షన్స్.

First Published:  2 Oct 2023 10:00 AM GMT
Next Story