Telugu Global
Science and Technology

మంచి జాబ్స్ కోసం స్కిల్స్ ట్రైనింగ్.. ఎలా అప్లై చేయాలంటే..

సిటీల్లో చదువుకున్న వాళ్లతో పోలిస్తే గ్రామాల్లో ఉండే స్టూడెంట్స్‌కు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి

మంచి జాబ్స్ కోసం స్కిల్స్ ట్రైనింగ్.. ఎలా అప్లై చేయాలంటే..
X

సిటీల్లో చదువుకున్న వాళ్లతో పోలిస్తే గ్రామాల్లో ఉండే స్టూడెంట్స్‌కు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి. అందుకే వాళ్లలో స్కిల్స్ డెవలప్ చేసేందుకు 'నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌' సబ్సిడీ ఫీజులతో కొన్ని కోర్సులను అందిస్తోంది.వాటి వివరాలివే..

మంచి ఉద్యోగాలు పొందాలంటే చదువొక్కటే సరిపోదు. ఉద్యోగానికి అవసరమయ్యే అన్నిరకాల స్కిల్స్ ఉండాలి. అందుకే గ్రామీణ విద్యార్థులకు అలాంటి స్కిల్స్ అందించేందుకు పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విదేశీ యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్స్‌తో ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పిస్తోంది నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌. 'స్కిల్‌ ఇండియా మిషన్‌'లో భాగంగా హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీ నిపుణులు పల్లెలోని విద్యార్థులకు జాబ్ స్కిల్స్ నేర్పుతారు. ఈ స్కిల్స్ ద్వారా పెద్దపెద్ద ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం తేలకవుతుంది.

'స్కిల్‌ ఇండియా మిషన్‌' ద్వారా 2025 నాటికి సుమారు 3 కోట్ల 50 లక్షల మందికి ఉపాధి నైపుణ్య శిక్షణను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కింద మూడు నుంచి ఆరు నెలల పాటు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్తారు. ఆ తర్వాత ఏడాదిన్నరపాటు ఇంటర్న్‌షిప్‌కు ఎంపికచేస్తారు. ఆ సమయంలో కొంత స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎంత స్టైఫండ్ వస్తుందనేది ట్రైనింగ్ సమయంలో పొందిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.

ఇకపోతే ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే వాళ్లకి రుణ సదుపాయం కూడా ఉంటుంది. నాన్‌-బ్యాంకింగ్‌ సంస్థలతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ సుమారు రూ.4 లక్షల రుణాన్ని అందజేస్తుంది. దీంతోపాటుగా కొన్ని కోర్సులకు 'లెర్న్‌ నౌ, పే లేటర్‌' అనే పథకం కింద ముందుగా నైపుణ్యాలను నేర్చుకుని, ఉద్యోగం వచ్చిన తర్వాత రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

మెరుగైన కమ్యూనికేషన్, టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలనే వారికి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ కోర్సులు.. మంచి ఉద్యోగాలు సాధించడానికి లేదా ఎంటర్ ప్రెనూర్స్ గా సక్సెస్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మరిన్ని వివరాల కోసం ఎన్‌ఎస్‌డీసీ ఇండియా వెబ్ సైట్(nsdcindia.org) ను సంప్రదించొచ్చు.

First Published:  28 Oct 2022 5:48 AM GMT
Next Story