Telugu Global
Science and Technology

5జీ ఫోన్ కొనాలా? బడ్జెట్‌లో మంచి ఫోన్స్ ఇవే..

దీపావళికి కొత్త 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుబాటులో కొన్ని బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్లపై ఓ లుక్కేయండి!

5జీ ఫోన్ కొనాలా? బడ్జెట్‌లో మంచి ఫోన్స్ ఇవే..
X

దీపావళికి కొత్త 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుబాటులో కొన్ని బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్లపై ఓ లుక్కేయండి!

ప్రస్తుతం అన్ని ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తక్కువ ధరకే 5జీ మోడల్స్‌ను తీసుకొస్తున్నాయి. దీనికితోడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ప్రకటించే స్పెషల్ సేల్స్‌లో ఇవి మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ 5జీ డీల్స్ ఇవీ..

శాంసంగ్‌ ఎం14

కొరియన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి రీసెంట్‌గా రిలీజైన ‘శాంసంగ్‌ గెలాక్సీ ఎం14 5జీ’.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్. ఇది ఎక్సినోస్ 1330 ఆక్టాకోర్ ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇది 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 6.6 ఇంచ్ స్క్రీన్, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎం14.. ధర రూ. 11,967గా ఉంది.

లావా బ్లేజ్ 2

ఈ నెల 9 వ తేదీన దేశీయ మొబైల్ బ్రాండ్ లావా నుంచి ‘లావా బ్లేజ్2.. 5జీ’ ఫోన్ రిలీజ్ అవ్వనుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 5,000ఎంఏహెచ్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని స్టార్టింగ్ ప్రైస్ రూ.10,999 ఉంది.

ఐకూ జెడ్‌6 లైట్‌

స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 ప్రాసెసర్‌‌పై పనిచేసే ‘ఐకూ జెడ్‌6 లైట్‌ 5జీ’ మంచి గేమింగ్ పెర్మామెన్స్ ఇస్తుంది. 6.5 ఇంచ్ స్క్రీన్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర రూ. 13,989.

పోకో ఎం6 ప్రో

‘పోకో ఎం6 ప్రో 5జీ’ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.7 ఇంచ్ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్‌లో ఇది రూ. 9,999కు లభిస్తోంది.

రియల్ మీ 11ఎక్స్

మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌‌పై పనిచేసే ‘రియల్ మీ 11 ఎక్స్ 5జీ’ ఫోన్ రూ. 14,850కు అందుబాటులో ఉంది. ఇందులో 6.7 ఇంచ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

First Published:  3 Nov 2023 11:25 AM GMT
Next Story