Telugu Global
Science and Technology

మెసేజ్ ముందే టైప్ చేసి అనుకున్న టైంకి పంపొచ్చు.. ఈ బెస్ట్ ఫీచర్ ఎలా వాడాలంటే..

వాట్సప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.

మెసేజ్ ముందే టైప్ చేసి అనుకున్న టైంకి పంపొచ్చు.. ఈ బెస్ట్ ఫీచర్ ఎలా వాడాలంటే..
X

రష్యాకు చెందిన ఇద్దరు సోదరులు పావెల్ దురోవ్, నికోలయ్ దురోవ్ రూపొందించిన యాప్ 'టెలిగ్రామ్'. అప్పటికే మార్కెట్‌లో ఉన్న 'వాట్సప్'కు పోటీగా వచ్చిన టెలిగ్రామ్, అనతి కాలంలోనే మంచి ఆదరణ పొందింది. 2013 చివర్లో ఐవోఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో వాట్సప్‌ కంటే మెరుగ్గా ఉండటంతో చాలా మంది దీన్నే ఆశ్రయించారు. ఈ మధ్య వాట్సప్ తన ప్రైవసీ పాలసీని మరింత కట్టుదిట్టం చేసిన తర్వాత టెలిగ్రామ్ యూజర్లు కాస్త తగ్గారు. కానీ బెస్ట్ ఫీచర్స్ కావాలంటే మాత్రం ఇప్పటికీ టెలిగ్రామ్ బెటర్ అని యూజర్లు చెబుతుంటారు.

వాట్సప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన రెండు ఫీచర్లు చాలా ఆకట్టుకుంటున్నాయి. మనం పంపిన మెసేజ్ ఎదురు వ్యక్తికి సైలెంట్‌గా వెళ్లే ఆప్షన్ ఒకటైతే.. మరొకటి షెడ్యూల్ మెసేజ్.వీటిని ఎలా వాడాలో ఒకసారి తెలుసుకుందాం.

- ముందుగా టెలిగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.

- గ్రూప్ కానీ, వ్యక్తిగతంగా కానీ ఈ మెసేజెస్ షెడ్యూల్ చేయవచ్చు. దీని కోసం ముందుగా సదరు చాట్‌ను ఓపెన్ చేయాలి.

- చాట్‌లో మెసేజ్‌ను టైప్ చేయండి. లేదంటే వేరే దగ్గర నుంచి కాపీ పేస్ట్ అయినా చేయవచ్చు.

- ఆ తర్వాత సెండ్ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకు ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది.

- ఈ పాపప్‌లో రెండు ఆప్షన్లు కనపడతాయి. ఒకటి మనం మెసేజ్ సెండ్ చేస్తే రిసీవ్ చేసుకునే వ్యక్తికి సైలెంట్‌గా వెళ్లే ఆప్షన్. ఇక రెండోది షెడ్యూల్ మెసేజ్.

- ఇక్కడ రెండో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

- షెడ్యూల్ మెసేజ్ మీద క్లిక్ చేయగానే.. టెలిగ్రామ్ డేట్ అండ్ టైమ్ సెట్ చేయమని అడుగుతుంది.

- మనకు కావల్సిన టైమ్ సెట్ చేసుకొని వదిలేస్తే.. అదే టైంకి టెలిగ్రామ్ సదరు మెసేజ్‌ను రిసీవర్‌కు పంపిస్తుంది.


First Published:  12 Aug 2022 2:47 PM GMT
Next Story