Telugu Global
Science and Technology

యూట్యూబ్ ప్రీమియం లైట్‌కు గుడ్ బై!

యూట్యూబ్‌లో తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు అందించే ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు గుడ్ బై చెప్పనుంది గూగుల్.

యూట్యూబ్ ప్రీమియం లైట్‌కు గుడ్ బై!
X

యూట్యూబ్ ప్రీమియం లైట్‌కు గుడ్ బై!

యూట్యూబ్‌లో తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు అందించే ‘ప్రీమియం లైట్’ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు గుడ్ బై చెప్పనుంది గూగుల్. అక్టోబర్ 25 తర్వాత ‘ ప్రీమియం లైట్ ’ అందుబాటులో ఉండదని గూగుల్ ప్రకటించింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

యూట్యూబ్‌లో ప్రీమియం ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీమియం ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి అత్యంత తక్కువ-ధరకు ‘ప్రీమియం లైట్’ అనే సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను కూడా అందుబాటులో ఉంచింది గూగుల్. 2021 నుంచి అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వెర్షన్‌ను ఇప్పుడు నిలిపివేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ముందుగా బెల్జియం, డెన్మార్క్, ఫిన్‌లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్లతో సహా పలు యూరోపియన్ దేశాల్లో ఈ సర్వీస్ ముగుస్తుంది. ఆ తర్వాత మిగిలిన దేశాల్లో కూడా ఆగిపోయే అవకాశం ఉంది.

కేవలం రూ.99 కే లభించే ప్రీమియం లైట్ ప్లాన్‌తో యూజర్లు యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్లు, బ్యాక్ గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండవు. అయితే ఇకపై ప్రీమియం లైట్ ఆగిపోతుంది. కాబట్టి యూజర్లు యాడ్స్‌తో వీడియోలు చూడాల్సి ఉంటుందని, యాడ్స్ రాకూడదంటే ప్రీమియం ప్లాన్ తీసుకోవాలని యూట్యూబ్ ప్రకటించింది. తగినంత డిమాండ్ లేకపోవడం వల్లనే ఈ ప్లాన్‌ను విత్ డ్రా చేస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ ధరలు ఏడాదికి రూ.1299, మూడు నెలలకు రూ. 399, నెలకు రూ.139 గా ఉన్నాయి. ప్రీమియం ప్లాన్‌లో భాగంగా యాడ్ ఫ్రీ వీడియోస్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, బ్యాక్ గ్రౌండ్ ప్లే, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ఫీచర్లున్నాయి. త్వరలోనే యూట్యూబ్.. ‘ఏఐ బేస్డ్ షార్ట్ వీడియో టూల్’ ను తీసుకురానుంది. అలాగే ‘డ్రీమ్ స్క్రీన్’ అనే మరో కొత్త ఫీచర్‌‌పై కూడా యూట్యూబ్ పనిచేస్తోంది.

First Published:  28 Sep 2023 7:51 AM GMT
Next Story