Telugu Global
Science and Technology

Samsung Galaxy S24 | హెచ్‌డీఆర్ మ‌ద్ద‌తుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24.. 2024 జ‌న‌వ‌రిలో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌?!

Samsung Galaxy S24 | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్ నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్న‌ది. 2024 జ‌న‌వ‌రి మ‌ధ్య‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్లు గ్లోబ‌ల్‌ మార్కెట్‌తోపాటు భార‌త్ మార్కెట్‌లోనూ ఆవిష్క‌రించ‌నున్న‌ద‌ని తెలుస్తోంది.

Samsung Galaxy S24 | హెచ్‌డీఆర్ మ‌ద్ద‌తుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24.. 2024 జ‌న‌వ‌రిలో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌?!
X

Samsung Galaxy S24 | హెచ్‌డీఆర్ మ‌ద్ద‌తుతో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24.. 2024 జ‌న‌వ‌రిలో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌?!

Samsung Galaxy S24 | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్ మేజ‌ర్ శాంసంగ్ నుంచి మ‌రో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్న‌ది. 2024 జ‌న‌వ‌రి మ‌ధ్య‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్లు గ్లోబ‌ల్‌ మార్కెట్‌తోపాటు భార‌త్ మార్కెట్‌లోనూ ఆవిష్క‌రించ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ (Samsung Galaxy S24 Series) ఫోన్ల‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ (Samsung Galaxy S24+), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్ల‌లో జూమ్ ఎనీప్లేస్‌, శాటిలైట్ క‌నెక్టివిటీ (Satellite Connectivity) ఉంటుంద‌ని స‌మాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్ల‌కు హెచ్‌డీఆర్ (Support Ultra HDR) మ‌ద్ద‌తుతో ఆండ్రాయిడ్ 14 ఆధారిత వ‌న్ యూఐ6 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయ‌ని చెబుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ (Samsung Galaxy S24) ఫోన్లు ఎక్స్‌నోస్ / అండ్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్ క‌లిగి ఉంటాయి. స‌మాచారం. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ (Snapdragon 8 Gen 3 SoC) చిప్‌సెట్‌, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 + (Samsung Galaxy S24+), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్లు డెకాకోర్ ఎక్స్‌నోస్ 2500 ఎస్వోసీ (deca-core Exynos 2500 SoC) చిప్‌సెట్‌తో వ‌స్తాయ‌ని స‌మాచారం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్ ఫోన్లు ఐసోసెల్ జూమ్ ఎనీప్లేస్ టెక్నాల‌జీ (ISOCELL Zoom Anyplace technology)తోపాటు అప్‌గ్రేడెడ్ 200-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. టెట్రా పిక్సెల్ టెక్నాల‌జీ (Tetra-pixel Technology) ఉప‌యోగించి ఏ డైరెక్ష‌న్‌లోనైనా 4కే వీడియోల‌పై 4ఎక్స్ జూమ్‌తో వీడియో కాప్చ‌రింగ్‌కు వీలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఎయిడెడ్ ట్రాకింగ్ (AI-Aided Tracking) ఫీచ‌ర్ జ‌త చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెట‌ప్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 200-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ2ఎస్ఎక్స్ (Samsung ISOCELL HP2SX) ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, 12-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 564 ఆల్ట్రావైడ్ (Sony IMX564 ultra-wide) కెమెరా, 10-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ టెలిఫోటో లెన్స్ విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 48-మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 48-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 5ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటాయ‌ని చెబుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 ఫోన్ 25 వాట్ల ఫాస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4900 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ.. హై ఎండ్ వేరియంట్లు (గెలాక్సీ ఎస్‌24+, గెలాక్సీ ఎస్‌24 ఆల్ట్రా) 4900/5000 ఎంఏహెచ్ సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ విత్ 45-65 వాట్ల చార్జింగ్ స్పీడ్ మ‌ద్ద‌తు కలిగి ఉంటాయ‌ని తెలిసింది. రెగ్యుల‌ర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 6.2 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24+ ఫోన్ 6.7 అంగుళాల 120 హెర్ట్జ్ డైన‌మిక్ అమోలెడ్ ప్యానెల్ క‌లిగి ఉంటాయి.

First Published:  31 Oct 2023 7:32 AM GMT
Next Story