Telugu Global
Science and Technology

మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23.. ఫీచర్లివే..

పాపులర్ మొబైల్ బ్రాండ్ శాంసంగ్‌ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ‘ఎస్‌23’ లైనప్‌లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.

మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23.. ఫీచర్లివే..
X

మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23.. ఫీచర్లివే..

పాపులర్ మొబైల్ బ్రాండ్ శాంసంగ్‌ నుంచి గెలాక్సీ సిరీస్‌లో ‘ఎస్‌23’ లైనప్‌లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు ఉన్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు చూద్దాం.

రీసెంట్‌గా శాంసంగ్ నుంచి గెలాక్సీ ‘ఎస్ 23’, ‘గెలాక్సీ ఎస్ 23+’, ‘గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ పేర్లతో మూడు ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వీటిలో గెలాక్సీ ఎస్23 మోడల్.. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.74,999గా ఉంది. గెలాక్సీ ఎస్ ‌23+ మోడల్‌ 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.94,999గా ఉంది. అలాగే గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్‌లో 12జీబీ +256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,24,999గా ఉంది. ఈ ప్రీమియం ఫోన్‌లో12జీబీ+ 512 జీబీ, 12జీబీ+1టీబీ వేరియంట్‌లు కూడా ఉన్నాయి. ఈ మూడు మొబైల్స్ ఫిబ్రవరి 17 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి.

గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్స్ అన్నీ ఆండ్రాయిడ్‌ 13తో పనిచేస్తాయి. వీటిలో శాంసంగ్ వన్‌యూఐ 5.1 ఉంటుంది. అలాగే ఈ మొబైల్స్‌లో లేటెస్ట్ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ ‌2 ప్రాసెసర్‌ వాడారు. ఈ మూడు ఫోన్లలో ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్, వైర్‌‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కామన్‌గా ఉంటాయి.

ఇక గెలాక్సీ ఎస్ 23 విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాతో పాటు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ ఎస్ 23+ మొబైల్ 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో ఎస్ 23లో ఉన్న కెమెరా సెటప్ ఉంటుంది. 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ... 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 200ఎంపీ ప్రైమరీ కెమెరా 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 10 ఎంపీ టెలీఫోటో లెన్స్‌తో పాటు 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

First Published:  6 Feb 2023 12:56 PM GMT
Next Story