Telugu Global
Science and Technology

Samsung Galaxy S23 Series | శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23+ ఫోన్లపై భారీగా ధ‌ర త‌గ్గింపు.. కార‌ణ‌మిదే..?!

Samsung Galaxy S23 Series: ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ శాంసంగ్ (Samsung) భార‌త్ మార్కెట్‌లో త‌న ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 17న ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

Samsung Galaxy S23 Series | శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23+ ఫోన్లపై భారీగా ధ‌ర త‌గ్గింపు.. కార‌ణ‌మిదే..?!
X

Samsung Galaxy S23 Series: ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ మేజ‌ర్ శాంసంగ్ (Samsung) భార‌త్ మార్కెట్‌లో త‌న ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్ల‌ను ఈ నెల 17న ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌తేడాది మార్కెట్‌లో రిలీజ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23), శాంసంగ్ గెలాక్సీ 23+ (Samsung Galaxy S23+) ఫోన్ల‌పై భారీగా ధ‌ర త‌గ్గించింది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ల‌లో స‌వ‌రించిన ధ‌రతో లిస్ట్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23+ (Samsung Galaxy S23+) ఫోన్లు రెండే క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెస‌ర్‌, డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ (Dynamic AMOLED 2X ) డిస్‌ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న‌ది. గ‌తేడాది ప్ర‌క‌టించిన ధ‌ర‌తో పోలిస్తే రూ.10 వేలు త‌క్కువ‌కు అందుబాటులోకి తెచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఫోన్‌ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.64,999, 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.69,999ల‌కు అందుబాటులో ఉన్నాయి. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లో ఆవిష్క‌రించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 బేస్ వేరియంట్ రూ.74,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,999 ప‌లికాయి. ప్ర‌స్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23+ (Samsung Galaxy S23+) 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.84,999 నుంచి రూ.74,999, 8జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,04,999 నుంచి రూ.94,999ల‌కు దిగి వ‌చ్చాయి. ఇంత‌కుముందు సైతం కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను మార్కెట్లో ఆవిష్క‌రించిన త‌ర్వాత పాత మోడ‌ల్ ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గించింది శాంసంగ్‌.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 (Samsung Galaxy S23) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ (AMOLED 2X) డిస్‌ప్లే, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 + (Samsung Galaxy S23+) ఫోన్‌48 హెర్ట్జ్ టు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మ‌ద్ద‌తుతో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్‌ (Dynamic AMOLED 2X) డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. రెండు మోడ‌ల్ ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫామ్ (Qualcomm Snapdragon 8 Gen 2 Mobile Platform) ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటాయి. రెండింటిలోనూ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ వైడ్ యాంగిల్ సెన్స‌ర్ కెమెరాతోపాటు 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఫోన్ 25 వాట్ల వైర్డ్ చార్జింగ్‌, 15 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 3900 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23+ ఫోన్ 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉన్నాయి.

First Published:  8 Jan 2024 9:05 AM GMT
Next Story