Telugu Global
Science and Technology

50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో శాంసంగ్ ఎఫ్55! ధర ఎంతంటే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్‌ రీసెంట్‌గా ‘గెలాక్సీ ఎఫ్‌55’ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..

50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో శాంసంగ్ ఎఫ్55! ధర ఎంతంటే..
X

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్‌ రీసెంట్‌గా ‘గెలాక్సీ ఎఫ్‌55’ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..

శాంసంగ్ ఎఫ్55 మొబైల్ మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరా కూడా50 మెగాపిక్సెల్ సెన్సర్ కలిగి ఉంటుంది. అలాగే ఇది లెదర్ ఫినిష్‌తో ప్రీమియం లుక్ కలిగి ఉంది.

శాంసంగ్‌ ఎఫ్‌55 ఫోన్.. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి. డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

ఈ ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ అమర్చారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉంది. ప్రైమరీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. దీంతో మంచి క్వాలిటీ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో అమర్చిన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 45 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్సులో ఛార్జర్‌ ఉండదు. సెపరేట్‌గా కొనుక్కోవాల్సి ఉంటుంది.

శాంసంగ్‌ ఎఫ్‌55 మొబైల్ ప్రీమియం లెదర్ డిజైన్‌తో వస్తుంది. అలాగే ఇందులో వైఫై 6, యూఎస్‌బీ 2.0, బ్లూటూత్‌ 5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యుయల్ నానో సిమ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, ఐపీ 67 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ధరల వివరాల్లోకి వెళ్తే.. 8జీబీ+128జీబీ బేస్‌ వేరియంట్‌ ధర రూ.26,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.32,999గా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. లాంఛింగ్ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై రూ.2,000 వరకూ డిస్కౌంట్‌ ఉంది.

First Published:  28 May 2024 11:08 AM GMT
Next Story