Telugu Global
Science and Technology

జియో 5జీ ఫోన్ వచ్చేస్తోంది! ఫీచర్లు ఇవే..

తాజాగా జియో.. 5జీ నెట్‌వర్క్‌ను టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి.

Reliance Jio 5G phone
X

తాజాగా జియో.. 5జీ నెట్‌వర్క్‌ను టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే జియో తన 5జీ స్మా్ర్ట్‌ ఫోన్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. తక్కువ ధరకే లేటెస్ట్ 5జీ ఫీచర్లను అందించబోతోంది.

జియో సంస్థ గతేడాది జియో ఫోన్ నెక్ట్స్‌ను విడుదల చేసింది. రూ. 5,000కే ఆకర్షణీయమైన ఫీచర్స్ ఇవ్వడంతో ఆ ఫోన్ మార్కెట్లో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు అప్‌డేట్ అయిన 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తూ త్వరలోనే జియో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే 5జీ ఫోన్‌కు సంబంధించిన పనులు మొదలయినట్టు సమాచారం. దసరా లేదా ఈ ఏడాది చివరినాటికి జియో 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల అవ్వొచ్చు.

జియో 5జీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. గూగుల్‌, జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 480 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ చిప్ సెట్ 5 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్ లో 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 2 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. ఇక వీటితో పాటు జియో 5జీ ఫోన్ లో మై జియో, జియో టీవీ వంటి ఉచిత జియో యాప్స్‌ ఉంటాయి. ఇక జియో 5జీ ఫోన్‌ ధర విషయానికొస్తే... రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని అంచనా. జియో ఫోన్ నెక్ట్స్‌ తరహాలో యూజర్లు కేవలం రూ. 2,500 చెల్లించి 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునేలా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండొచ్చు.

First Published:  16 Aug 2022 8:00 AM GMT
Next Story