Telugu Global
Science and Technology

రెడ్‌మీ నోట్ 13 సిరీస్.. బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!

రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్ సిరీస్ చాలా పాపులర్. తాజాగా ఈ సిరీస్ నుంచి రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరిట మూడు ఫోన్లు రిలీజయ్యాయి.

రెడ్‌మీ నోట్ 13 సిరీస్.. బడ్జెట్‌లో మంచి ఫీచర్లు!
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ షావోమీ నుంచి రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్లు రీసెంట్‌గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో మంచి స్పెసిఫికేషన్లు ఉండడంతో పాటు బడ్జెట్ మిడ్‌రేంజ్‌లో ఉండడంతో ప్రస్తుతం ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతన్నాయి.

రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్ సిరీస్ చాలా పాపులర్. తాజాగా ఈ సిరీస్ నుంచి రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరిట మూడు ఫోన్లు రిలీజయ్యాయి. వీటి స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

‘రెడ్‌మీ నోట్‌ 13 5జీ’.. బేస్ మోడల్‌లో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుతో పనిచేస్తుంది. ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 బేస్డ్ ఎంఐయూఐ 14తో వస్తోంది. ఇందులో వెనుక 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 33వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఐపీ54 డస్ట్‌, స్ప్లాష్‌ ప్రూఫ్‌ ఫీచర్ ఉంది. రెడ్‌మీ నోట్‌ 13 5జీ.. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఆర్కిటిక్‌ వైట్‌, ప్రిజమ్‌ గోల్డ్‌, స్టెల్త్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

ఇక ‘రెడ్‌మీ నోట్‌ 13ప్రో’, ‘రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+’ మోడల్స్‌లో ఒకే తరహా ఫీచర్లు ఉన్నాయి. ‘ప్రో’ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ ఉంటే ‘ప్రో+’ మోడల్‌లో డైమెన్‌సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ రెండు మోడళ్లలో 6.67 అంగుళాల అమోలెడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే రెండు మోడల్స్‌లో 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. రెండింట్లో కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ ఉంది. వీటిలో 5,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ‘ప్రో’ మోడల్ 67వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, ‘ప్రో+’ మోడల్ 120వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.


రెడ్‌మీ నోట్‌ 13 ప్రో 5జీ.. 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.25,999, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. ఆర్కిటిక్‌ వైట్, కోరల్‌ పర్పుల్‌, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999, 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.33,999గా ఉంది. ఫ్యూజన్‌ బ్లాక్, ఫ్యూజన్‌ పర్పుల్‌, ఫ్యూజన్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది.

First Published:  10 Jan 2024 3:00 AM GMT
Next Story