Telugu Global
Science and Technology

Redmi K70E | డిసెంబ‌ర్ మొద‌టివారంలో రెడ్‌మీ కే70ఈ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Redmi K70E | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ కే70ఈ (Redmi K70E) త్వ‌ర‌లో మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

Redmi K70E | డిసెంబ‌ర్ మొద‌టివారంలో రెడ్‌మీ కే70ఈ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Redmi K70E | డిసెంబ‌ర్ మొద‌టివారంలో రెడ్‌మీ కే70ఈ ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Redmi K70E | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రెడ్‌మీ (Redmi) త‌న రెడ్‌మీ కే70ఈ (Redmi K70E) త్వ‌ర‌లో మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5120 ఏంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ వ‌స్తోంద‌ని చెబుతున్నారు. ఓలెడ్ డిస్‌ప్లే (OLED display), మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ఎస్వోసీ చిప్‌సెట్ (MediaTek Dimensity 9200+ SoC)తో వ‌స్తోంది. చైనా మార్కెట్లో రెడ్‌మీ కే70 సిరీస్ (The Redmi K70 series)గా, గ్లోబ‌ల్ మార్కెట్లో పొకో ఎఫ్‌6 సిరీస్ (POCO F6 series) గా వ‌స్తోంది. 1.5కే రిజొల్యూష‌న్‌తో ఓలెడ్ డిస్ ప్లే, ఇంప్రెస్సివ్ ఫీచ‌ర్ల శ్రేణితో వ‌స్తోంది. అయితే, ఎప్పుడు మార్కెట్లో ఆవిష్క‌రిస్తార‌న్న సంగతి అధికారికంగా వెల్ల‌డి కాలేదు. వ‌చ్చేనెల మొద‌టి వారంలో చైనాలో మార్కెట్లో ఆవిష్క‌రిస్తార‌ని స‌మాచారం.

చైనా మార్కెట్‌లో రెడ్‌మీ కే70 (Redmi K70), రెడ్‌మీకే70 ప్రో (Redmi K70 Pro)తోపాటు రెడ్‌మీ కే70 ఈ (Redmi K70E) వ‌స్తోంది. రెడ్‌మీ కే70 (Redmi K70E) ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8 Gen 2 SoC), రెడ్‌మీ కే70 ప్రో (Redmi K70 Pro) ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ (Snapdragon 8 Gen 3 SoC)తో వ‌స్తుంద‌ని తెలుస్తోంది. రెడ్‌మీ కే70 ప్రో ఇన్‌స్క్రీన్ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తో వ‌స్తుంద‌ని చెబుతున్నారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఆవిష్క‌రించిన రెడ్‌మీ కే60 ఈ (Redmi K60E) ఫోన్ 6.67- అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే విత్ 2కే రిజొల్యూష‌న్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్‌సెట్ (MediaTek Dimensity 8200 SoC), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ వేరియంట్‌గా వ‌చ్చింది. 48-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ విత్ ఓఐఎస్ స‌పోర్ట్‌, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. రెడ్‌మీ కే60ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర దాదాపు రూ.26,000 (2199 చైనా యువాన్లు) ప‌లికింది.

First Published:  10 Nov 2023 7:12 AM GMT
Next Story