Telugu Global
Science and Technology

Realme P1 5G Series | రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల సేల్స్ ప్రారంభం.. లాంచింగ్ ఆఫ‌ర్‌గా రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్..!

Realme P1 5G Series | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల విక్ర‌యాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జ‌రుగుతాయి.

Realme P1 5G Series | రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల సేల్స్ ప్రారంభం.. లాంచింగ్ ఆఫ‌ర్‌గా రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్..!
X

Realme P1 5G Series | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియ‌ల్‌మీ త‌న రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల విక్ర‌యాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ జ‌రుగుతాయి. గ‌త‌వారం రియ‌ల్‌మీ బ‌డ్స్ టీ110, వై-ఫై వేరియంట్ రియ‌ల్‌మీ ప్యాడ్‌2తోపాటు రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. రియ‌ల్‌మీ పీ1 5జీ సిరీస్ ఫోన్ల‌లో రియ‌ల్‌మీ పీ1 5జీ, రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్లు ఉన్నాయి. రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ, రియ‌ల్‌మీ పీ1ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చాయి. రెండు ఫోన్లూ 45వాట్ల వైర్డ్ సూప‌ర్ వూక్ చార్జింగ్ మద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీలు క‌లిగి ఉంటాయి.

రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.16,999ల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్ పికాక్ గ్రీన్‌, ఫోనిక్స్ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999ల‌కు ల‌భిస్తాయి. ప్యార‌ట్ బ్లూ, ఫోనిక్స్ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తాయి. లాంచింగ్ ఆఫ‌ర్ సేల్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్‌పై రూ.1000, రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్‌పై రూ.2000 వ‌ర‌కూ కూప‌న్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్‌ను సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై కొనుగోలు చేస్తే రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంకు డిస్కౌంట్ మాత్రం ప‌రిమిత ఆఫ‌ర్‌గా అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్ కార్ట్ లేదా రియ‌ల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా మూడు నెల‌ల వ‌ర‌కూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఇక రియ‌ల్‌మీ పీ1 5జీ, రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ కొనుగోలుదారులకు రూ.899ల‌కే వైర్ లెస్ 2 నియోస్‌, రూ.1299ల‌కే రియ‌ల్‌మీ టీ110 యాడ్ ఆన్ ఆఫ‌ర్‌గా అంద‌జేస్తారు.

రియ‌ల్‌మీ పీ1 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియ‌ల్‌మీ యూఐ 5.0 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్‌ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే, రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క‌ర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటాయి. రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌, రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 6 జెన్ 1 ఎస్వోసీ ప్రాసెస‌ర్ క‌లిగి ఉంటాయి.

రియ‌ల్‌మీ పీ1 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరాతోపాటు 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. రియ‌ల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ600 ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంట‌ది. రెండు ఫోన్ల‌లోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

First Published:  22 April 2024 7:57 AM GMT
Next Story