Telugu Global
Science and Technology

త్వరలో రియల్‌మీ నార్జో 70 ప్రో లాంఛ్.. ఫీచర్లివే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ’ ఫోన్‌.. ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వనుంది.

త్వరలో రియల్‌మీ నార్జో 70 ప్రో లాంఛ్.. ఫీచర్లివే..
X

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి ‘రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ’ ఫోన్‌.. ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వనుంది. ఈ ఫోన్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

రియల్​మీ నార్జో 70 ప్రో స్మార్ట్​ఫోన్​.. ఈ నెలలోనే ఇండియాలో లాంచ్​అవ్వనుంది. దీనికి సంబంధించిన టీజర్ పోస్టర్ అమెజాన్‌లో కనిపించింది. గతేడాది జూలైలో ఆవిష్కరించిన రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ మొబైల్ కు అప్ డేటెడ్ వెర్షన్‌గా ఈ మొబైల్ రానుంది.

రియల్​మీ నార్జో 70 ప్రో మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్​సెట్​పై పనిచేస్తుంది. ఇందులో భారతదేశపు మొట్టమొదటి సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇది 50 మెగాపిక్సె్ల్ రిజల్యూషన్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో వస్తుంది. మొత్తం వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ సెన్సర్‌‌తో పాటు మరో టెలిఫోటో కెమెరా, ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా ఉండనున్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం మరో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌తో మొబైల్ ఫొటొగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్‌ రీడిఫైన్ అవుతుందని కంపెనీ ప్రమోట్ చేస్తుంది.

ఈ మొబైల్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. నాచ్ హోల్ డిజైన్‌తో వస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌తో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 వెర్షన్‌పై రన్ అవుతుంది. ఇందులో 5జీ కనెక్టివిటీ, డ్యుయల్ నానో సిమ్, బ్లూ టూత్ 5.2, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ వంటి ఫీచర్లున్నాయి.

రియల్‌మీ నార్జో 70ప్రో 5జీ బేస్ వేరియంట్ 8జీబీ+256 జీబీ ధర సుమారు రూ.20,000 ఉండే అవకాశం ఉంది. రూ. 4,000 వరకూ లాంఛింగ్ ఆఫర్లు కూడా ఉండొచ్చు. లాంఛింగ్ ఆఫర్ కింద రియల్‌మీ బడ్స్ టీ300 కూడా ఉచితంగా పొందొచ్చు.

First Published:  20 March 2024 3:45 AM GMT
Next Story