Telugu Global
Science and Technology

ఈ ఫోన్ ఓ అద్భుతం.. 10 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కేసే ఫోన్ ని తయారు చేసింది రియల్‌ మి సంస్థ. దీనిపేరు రియల్‌ మి జిటి-3. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ - 2023లో ఈ ఫోన్ ని లాంచ్ చేశారు.

Realme GT 3: ఈ ఫోన్ ఓ అద్భుతం.. 10 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్
X

Realme GT 3: ఈ ఫోన్ ఓ అద్భుతం.. 10 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్

గతంలో రాత్రిపూట సెల్ ఫోన్ చార్జింగ్ పెడితే తెల్లారే సరికి బ్యాటరీ ఫుల్ అనే మెసేజ్ కనపడుతుంది. అలా చార్జింగ్ పెట్టేసి పడుకునే రోజులవి. కానీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లు వచ్చేశాక దాదాపుగా అలాంటి ఇబ్బందులు తగ్గిపోయాయి.

ఐదు నిముషాలు చార్జింగ్ పెడితే దాదాపు 15 శాతం ఫోన్ బ్యాటరీ చార్జ్ అవుతుంది. అంతకు మించి అంటూ ఇప్పుడు రియల్ మి దూసుకొచ్చింది. రియల్ మి జీటీ సిరీస్ లో విడుదలైన కొత్త ఫోన్ కేవలం తొమ్మిదిన్నర నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది. అంటే నిమిషానికి 10 శాతం పైగా చార్జింగ్ ఎక్కేస్తుందనమాట. ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్ అద్భుతం అంటున్నారు తయారీదారులు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జింగ్ ఎక్కేసే ఫోన్ ని తయారు చేసింది రియల్‌ మి సంస్థ. దీనిపేరు రియల్‌ మి జిటి-3. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ - 2023లో ఈ ఫోన్ ని లాంచ్ చేశారు. 240 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ తో వచ్చిన తొలి ఫోన్‌ ఇదే. దీని ద్వారా 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీని కేవలం 9నిమిషాల 30 సెకన్లలో ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. మొదటి 50శాతం చార్జింగ్ కేవలం 4 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆ తర్వాత 50 శాతం చార్జింగ్ కి మిగతా ఐదున్నర నిమిషం టైమ్ తీసుకుంటుంది.


రేటెంతటే..?

సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫోన్ ధర కాస్త ఎక్కువే. బడ్జెట్ ఫోన్ల లిస్ట్ లోకి ఇది రాదు. ప్రస్తుతం భారత్ లో అందుబాటులోకి రాలేదు. మన దేశంలో దీని ధర 53వేల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. 8 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమరీతో బేసిక్ మోడల్ విడుదల చేస్తున్నారు. 16 జీబీ ర్యామ్ 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేది హై ఎండ్ వెర్షన్ అంటున్నారు. గతేడాది ఏప్రిల్‌ లో రియల్‌ మి జిటి-2 భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది తిరగకముందే రియల్‌ మి జిటి-3 అందుబాటులోకి వస్తోంది.

ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్, బ్యాక్ కెమెరాలో మూడు వేరియేషన్లున్నాయి. 50 ఎంపీ సోనీ IMX 890 సెన్సార్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్‌ అమర్చారు. ఎల్ఈడీ ప్యానెల్ అదనపు ఆకర్షణ. వెనుక వైపు ఆర్జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్‌ 25 రంగుల్ని చూపిస్తుంది. ఫోన్ కాల్స్‌, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్‌ వస్తుంది. ఇది నచ్చకపోతే ఆప్షన్ ని తీసివేయొచ్చు. నథింగ్ మొబైల్స్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎల్ఈడీ లైటింగ్ ని రియల్ మి లో కూడా తీసుకొచ్చారు.

First Published:  1 March 2023 10:19 AM GMT
Next Story