Telugu Global
Science and Technology

Realme - Valentine’s Day Sale | స్మార్ట్ ఫోన్ ప్రేమికుల‌కు రియ‌ల్‌మీ వాలెంటైన్స్ డే ఆఫ‌ర్లు.. ఇవీ డిటైల్స్‌..!

Realme - Valentine’s Day Sale | రియ‌ల్‌మీ నార్జో సిరీస్‌ (Realme Narzo Series) ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. మంగ‌ళ‌వారం నుంచి ఈ సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12 వ‌ర‌కు వాలెంటైన్స్ డే సేల్స్ కొన‌సాగుతాయి.

Realme - Valentine’s Day Sale | స్మార్ట్ ఫోన్ ప్రేమికుల‌కు రియ‌ల్‌మీ వాలెంటైన్స్ డే ఆఫ‌ర్లు.. ఇవీ డిటైల్స్‌..!
X

Realme - Valentine’s Day Sale | వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు- ఫిబ్ర‌వ‌రి 14) సంద‌ర్భంగా ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ (Realme) స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల‌కు అద్భుత‌మైన ఆఫ‌ర్‌లు ప్ర‌క‌టించింది. రియ‌ల్‌మీ నార్జో సిరీస్‌ (Realme Narzo Series) ఫోన్ల‌పై ధ‌ర‌లు త‌గ్గించింది. మంగ‌ళ‌వారం నుంచి ఈ సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 12 వ‌ర‌కు వాలెంటైన్స్ డే సేల్స్ కొన‌సాగుతాయి. ఈ - కామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా, రియ‌ల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా డిస్కౌంట్ సేల్స్ జ‌రుగుతాయి.

రియ‌ల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ (Realme Narzo 60x 5G), రియ‌ల్‌మీ నార్జో ఎన్ 55 (Realme Narzo N55), రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) ఫోన్లు త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. రియ‌ల్‌మీ నార్జో 60 ప్రో 5జీ (Realme Narzo 60 Pro 5G), రియ‌ల్‌మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G) ఫోన్ల‌కు డిస్కౌంట్లు వ‌ర్తిస్తాయి.

రియ‌ల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ (Realme Narzo 60 Pro 5G) 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ల‌పై రూ.2000 కూప‌న్ డిస్కౌంట్‌, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌పై రూ.4000 డిస్కౌంట్ కూప‌న్ ల‌భిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై మ‌రో రూ.2,000 అద‌న‌పు రాయితీ ల‌భిస్తుంది. దీంతో రియ‌ల్‌మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ ధ‌ర రూ.21,999 నుంచి ప్రారంభం అవుతుంది.

రియ‌ల్‌మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G) బేస్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.17,999 కాగా, డిస్కౌంట్ల‌తో రూ.14,999ల‌కే ల‌భిస్తుంది. హ‌య్య‌ర్ వ‌ర్ష‌న్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.19,999 నుంచి రూ.16,999ల‌కే దిగి వ‌స్తుంది.

రియ‌ల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ (Realme Narzo 60x 5G) ఫోన్ ధ‌ర రూ.10,999 ప‌లుకుతుంది. రియ‌ల్‌మీ నార్జో ఎన్‌55 ఫోన్ (Realme Narzo N55) 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.12,999 నుంచి రూ.8,999ల‌కు ల‌భిస్తుంది. రియ‌ల్‌మీ నార్జో ఎన్‌53 (Realme Narzo N53) ఫోన్ ధ‌ర రూ.8,999 నుంచి రూ.7,499ల‌కు దిగి వ‌చ్చింది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499 నుంచి రూ.9,499ల‌కే ల‌భిస్తుంది.

First Published:  6 Feb 2024 7:52 AM GMT
Next Story