Telugu Global
Science and Technology

త్వరలోనే రియల్‌మీ 12 సిరీస్ ఫోన్లు! ఫీచర్లివే..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తమ మిడ్ రేంజ్ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ12 ఫోన్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది.

త్వరలోనే రియల్‌మీ 12 సిరీస్ ఫోన్లు! ఫీచర్లివే..
X

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తమ మిడ్ రేంజ్ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ12 ఫోన్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది. ఇందులో భాగంగా మూడు ఫోన్లు రిలీజ్ అవ్వొచ్చు. వాటి ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

ఈ నెల ఆరో తేదీన ఇండియన్ మార్కెట్లో రియల్ మీ 12 సిరీస్ ఫోన్లు లాంఛ్ అవ్వనున్నాయి. ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. వీటిలో ఫుల్ హెచ్‌డీ ప్లస్, ఓల్‌ఈడీ స్క్రీన్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుంది.

రియల్‌మీ 12 సిరీస్‌లో.. ‘రియల్‌మీ12 + 5జీ’, ‘రియల్‌మీ12 ప్రో 5జీ’, ‘రియల్‌మీ12 ప్రో+ 5జీ’ ఫోన్లు ఉండనున్నాయి. బేస్ మోడల్ అయిన రియల్‌మీ12 + 5జీ ఫోన్.. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ 2కె డిస్‌ప్లేతో ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5.0 వెర్షన్‌పై రన్ అవుతుంది.

రియల్ మీ 12+ 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన 50 -మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీల కోసం16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

రియల్‌మీ12 + 5జీ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఇది 67వాట్ల సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, బ్లూటూత్ 5.2 వంటి ఫీచర్లున్నాయి.

ఇక ధరల విషయానికొస్తే..8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,200, 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.26,200గా ఉంది. నేవిగేటర్ బీజ్, పయనీర్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మిగతా రెండు మోడల్స్ ధరలు, ఫీచర్ల గురించి తెలియాల్సి ఉంది.

First Published:  5 March 2024 3:30 PM GMT
Next Story