Telugu Global
Science and Technology

Oppo Reno 11 Series | 12న భార‌త్ మార్కెట్‌లోకి ఒప్పో రెనో11 ప్రో.. ఒప్పో రెనో11.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Oppo Reno 11 Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ఒప్పో రెనో11 (Oppo Reno 11), ఒప్పో రెనో11 ప్రో (Oppo Reno 11 Pro) ఫోన్లను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Oppo Reno 11 Series | 12న భార‌త్ మార్కెట్‌లోకి ఒప్పో రెనో11 ప్రో.. ఒప్పో రెనో11.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Oppo Reno 11 Series | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ ఒప్పో (Oppo) త‌న ఒప్పో రెనో11 (Oppo Reno 11), ఒప్పో రెనో11 ప్రో (Oppo Reno 11 Pro) ఫోన్లను త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఒప్పో రెనో11 మోడ‌ల్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ, ఒప్పో రెనో11 ప్రో మోడ‌ల్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తుంది. క‌ర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వ‌స్తున్న ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్ల‌లో 50-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. ఈ నెల 12న భార‌త్ మార్కెట్లో ఒప్పో రెనో11 సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రిస్తామ‌ని ఒప్పో త‌న అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీక‌రించింది.

ఒప్పో రెనో11 ప్రో ఫోన్ సుమారు రూ.35 వేల ధ‌ర ప‌లుకుతుండ‌వ‌చ్చు. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ54, వివో వీ29 ఫోన్ల‌తో త‌ల‌ప‌డుతుంది. ఇక ఒప్పో రెనో11 ఫోన్ రూ.28 వేల ధ‌ర‌కే ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ34, వివో వీ29ఈ ఫోన్ల‌తో త‌ల ప‌డుతుందని తెలుస్తోంది. ఒప్పో రెనో11 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ, ఒప్పో రెనో11 ప్రో ఫోన్ 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. ఒప్పో రెనో11, ఒప్పో రెనో 11 ప్రో ఫోన్లు చైనా మార్కెట్లో 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ, 80 వాట్ల ఫాస్ చార్జింగ్ మ‌ద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటాయి.

ఒప్పో రెనో11 సిరీస్ పోన్లు ఆండ్రాయిడ్ 14 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తాయి. ఈ ఫోన్లు 6.70 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,412 పిక్సెల్స్‌) ఓలెడ్ క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటాయి. ఒప్పో రెనో11 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సోనీ ఐఎంఎక్స్‌890 సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్స‌ర్ కెమెరా, 8- మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. మ‌రోవైపు, ఒప్పో రెనో 11 ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్స‌ర్ విత్ ఓఐఎస్ స‌పోర్ట్‌, 32- మెగా పిక్సెల్ టెలిఫోటో సెకండ‌రీ సెన్స‌ర్‌, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్ల‌లోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంటుంది.

First Published:  5 Jan 2024 9:57 AM GMT
Next Story