Telugu Global
Science and Technology

ఒప్పో నుంచి సూపర్ డ్యూరబుల్ ఫోన్.. ఫీచర్లివే..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఎ3 ప్రో’ పేరుతో ఓ కొత్త మొబైల్ ఇండియాలో లాంఛ్ అవ్వబోతోంది. అయితే ఇది ప్రపంచంలోనే మొదటి ‘ఫుల్‌ లెవల్ వాటర్ ప్రూఫ్ మొబైల్’ అని ఒప్పో చెప్తోంది.

ఒప్పో నుంచి సూపర్ డ్యూరబుల్ ఫోన్.. ఫీచర్లివే..
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఎ3 ప్రో’ పేరుతో ఓ కొత్త మొబైల్ ఇండియాలో లాంఛ్ అవ్వబోతోంది. అయితే ఇది ప్రపంచంలోనే మొదటి ‘ఫుల్‌ లెవల్ వాటర్ ప్రూఫ్ మొబైల్’ అని ఒప్పో చెప్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఒప్పో నుంచి రాబోతున్న ‘ఒప్పో ఎ3 ప్రో’ మొబైల్ ఫుల్ లెవల్ వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌, డస్ట్ ప్రూఫ్ రేటింగ్‌తో ఉండబోతోంది. అందుకే దీన్ని ‘సూపర్ డ్యూరబుల్ ఫోన్’గా ఒప్పో ప్రమోట్ చేస్తుంది. ఈ మొబైల్ ఏప్రిల్ 12న చైనాలో లాంచ్ అవుతుంది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.

ఒప్పో ఎ3 ప్రో.. ఫోన్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. అలాగే ఇందులో 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది.

కెమరాల విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు ముందువైపు 8 మెగా పిక్సెల్ సెల్ఫీకెమెరా ఉండనుంది. ఇందులో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 7.89ఎంఎం థిక్‌నెస్, 177 గ్రాముల బరువుతో ఉంటుంది.

ఎత్తు నుంచి కిందపడినా తట్టుకునేలా ఒప్పో ఎ3 ప్రో మొబైల్ లో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ అమర్చారు. అలాగే ఇందులో ఫుల్ లెవల్ ఐపీ69 వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఉంది. అలాగే ఈ మొబైల్‌లో 5జీ కనెక్టివిటీ, కెపాసిటివ్ మల్టీ టచ్, పంచ్ హోల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లున్నాయి.

ఈ మొబైల్ బెస్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్‌గా ట్రెండ్ సెట్ చేస్తుందని ఒప్పో చెప్తోంది. మొబైల్ టాప్ వేరియంట్12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో రానుంది. ధర సుమారు రూ. 30,000 వరకూ ఉండొచ్చు.

First Published:  12 April 2024 11:46 AM GMT
Next Story