Telugu Global
Science and Technology

ఒప్పో నుంచి రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఫీచర్లివే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఏ1ఎస్’, ‘ఒప్పో ఏ1ఐ’ పేర్లతో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి.

ఒప్పో నుంచి రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఫీచర్లివే!
X

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఏ1ఎస్’, ‘ఒప్పో ఏ1ఐ’ పేర్లతో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి. వీటి ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

రూ. 15,000 బడ్జెట్ రేంజ్‌లో ఒప్పో రెండు ఫోన్లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇవి మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌‌పై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ వెర్షన్ 14 పై రన్ అవుతాయి.

ఈ ఫోన్ల కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో ఏ1ఎస్.. డ్యుయల్ రేర్ కెమెరా, ఒప్పో ఏ1ఐ సింగిల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఒప్పో ఏ1ఎస్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు 2 -మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 8 -మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో ఏ1ఐ లో 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు 5-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఒప్పో ఏ1ఎస్ ఫోన్ లో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగిన 6.72 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఒప్పో ఏ1ఐ ఫోన్‌లో 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగిన 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే అమర్చారు.

ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఏ1ఐలో 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఏ1 ఎస్‌లో 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెండింటిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5జీ, వై-ఫై5, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లున్నాయి.

ధరల విషయానికొస్తే.. ఒప్పో ఏ1ఎస్.. 12 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.13,800, ఒప్పో ఏ1ఐ.. 8జీబీ+ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.12,700 గా ఉన్నాయి. నైట్ బ్లాక్, ఫాంటోమ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

First Published:  23 April 2024 8:33 AM GMT
Next Story