Telugu Global
Science and Technology

వాట్స‌ప్ యూజర్స్ కు షాకింగ్ న్యూస్ - అమ్మకానికి 50 కోట్ల మంది డాటా

WhatsApp data leak: 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల వివరాలు లీక్ అయ్యాయి. ఈ డేటాను హ్యాక్ చేసిన ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో ఆ నెంబర్లను అమ్మకానికి పెట్టాడు. అందులో భారతీయుల డేటా కూడా ఉంది.

WhatsApp data leak: వాట్స‌ప్ యూజర్స్ కు షాకింగ్ న్యూస్ - అమ్మకానికి 50 కోట్ల మంది డాటా
X

WhatsApp data leak: వాట్స‌ప్ యూజర్స్ కు షాకింగ్ న్యూస్ - అమ్మకానికి 50 కోట్ల మంది డాటా

ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వాట్సప్ వినియోగదారుల వివరాలు లీక్ అయ్యాయి. 50 కోట్ల మందికి చెందిన ఫోన్ నెంబర్లను ఓ హ్యాకర్ ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. డేటాబేస్‌లో 84 వేర్వేరు దేశాలకు చెందిన వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్‌లు ఉన్నాయి. ఇందులో US, UK, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతీయ వినియోగదారులున్నారు.

డేటాలో 32 మిలియన్ల కంటే ఎక్కువ US వినియోగదారుల రికార్డులు ఉన్నాయని హ్యాకర్ పేర్కొన్నాడు. ఇది కాకుండా, ఈజిప్ట్‌లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్‌లో 20 మిలియన్లు,టర్కీలో 20 మిలియన్ల మంది వినియోగదారులు, సుమారు 10 మిలియన్ల మంది రష్యన్లు, 11 మిలియన్లకు పైగా UK పౌరుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు నివేదించబడింది.

ఈ ఫోన్ నెంబర్లను అమ్మకానికి పెట్టిన హ్యాకర్ ఒక్కో దేశానికి చెందిన ఫోన్ నెంబర్లకు ఒక్కో రేట్ ప్రకటించాడు.

US డేటాను $7,000 (దాదాపు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది, UK, డేటా ధర $2,500 (సుమారు రూ. 2,04,175) , జర్మనీ $2,000 (దాదాపు రూ. 1,63,340).

వీళ్ళంతా వాట్సప్ లో క్రియాశీల వినియోగదారులని హ్యాకర్ తెలిపాడు. అయితే వీరి డాటాను ఎలా సంపాదించాడనే విషయాన్ని మాత్రం ఆ హ్యాకర్ చెప్పలేదు.

ఈ డాటా కొన్నవారు ఫిషింగ్ దాడుల కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే వాట్సాప్ వినియోగదారులు తెలియని నంబర్‌ల నుండి కాల్ వచ్చినా, మెసేజ్ లు వచ్చినా స్పందించ‌వద్దని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  26 Nov 2022 12:47 PM GMT
Next Story