Telugu Global
Science and Technology

OnePlus Pad Go | 6న వ‌న్‌ప్ల‌స్ నుంచి రెండో ఆండ్రాయిడ్ టాబ్లెట్ వ‌న్‌ప్ల‌స్ పాడ్ గో.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!

OnePlus Pad Go | చైనా టెక్ దిగ్గ‌జం `వ‌న్ ప్ల‌స్ (OnePlus) భార‌త్ మార్కెట్లోకి త‌న రెండో ఆండ్రాయిడ్ టాబ్లెట్ (Android tablet) వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది.

OnePlus Pad Go | 6న వ‌న్‌ప్ల‌స్ నుంచి రెండో ఆండ్రాయిడ్ టాబ్లెట్ వ‌న్‌ప్ల‌స్ పాడ్ గో.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
X

OnePlus Pad Go | ఆండ్రాయిడ్ టాబ్లెట్ వ‌న్‌ప్ల‌స్ పాడ్ గో

OnePlus Pad Go | చైనా టెక్ దిగ్గ‌జం `వ‌న్ ప్ల‌స్ (OnePlus) భార‌త్ మార్కెట్లోకి త‌న రెండో ఆండ్రాయిడ్ టాబ్లెట్ (Android tablet) వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) ఆవిష్క‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈ నెల ఆరో తేదీన భార‌త్ మార్కెట్లోకి వ‌స్తున్న వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) ట్విన్ మింట్ (Twin Mint) క‌ల‌ర్ ఉంటుంద‌ని సంకేతాలిచ్చింది. వ‌న్ ప్ల‌స్ పాడ్ గో ఆవిష్క‌ర‌ణ‌పై ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్ర‌త్యేకంగా మైక్రోసైట్ రూపొందించింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఫెస్టివ‌ల్ సేల్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌`లోనూ వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) అందుబాటులో ఉంటుంద‌ని భావిస్తున్నారు.

తొలుత వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో కొన్ని నూత‌న వ‌న్ ప్ల‌స్ ఉత్ప‌త్తుల‌తో క‌లిపి వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) ఆవిష్క‌రిస్తార‌ని వార్త‌లొచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన వ‌న్ ప్ల‌స్ పాడ్ (OnePlus Pad) కంటే చౌక‌గా వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) త్వ‌ర‌లో ఆవిష్క‌రిస్తామ‌ని సంకేతాలిచ్చింది.

డోల్బీ ఆట్మోస్ ఆడియో మ‌ద్ద‌తుతో క్వాడ్ స్పీక‌ర్ల‌తో వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) వ‌స్తుంది. దీంతో సినిమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను యూజ‌ర్లు పొందుతార‌ని వ‌న్ ప్ల‌స్ చెబుతోంది. 7:5 నిష్ప‌త్తి వ‌ద్ద 2.4 కే రిజొల్యూష‌న్‌తో 11.35 అంగుళాల డిస్‌ప్లే క‌లిగి ఉంటుందీ వ‌న్ ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) టాబ్లెట్‌. మ్యాట్టె మెట‌ల్ అండ్ గ్లోషీ ఫినిష్‌తో టూ టోన్ గ్రీన్ రేర్ డిజైన్ క‌లిగి ఉంటుంది. క‌ర్వ్‌డ్ ఎడ్జ్‌ల‌తో కెమెరా లేఔట్ క‌లిగి ఉంటుంది. సింగిల్ రేర్ కెమెరాతోపాటు నాలుగు స్పీక‌ర్లు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

వ‌న్‌ప్ల‌స్ పాడ్ గో (OnePlus Pad Go) టాబ్లెట్.. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ విత్ యూఎఫ్ఎస్ 2.2 టెక్నాల‌జీతో వ‌స్తుంది. మీడియాటెక్ హెలియో జీ99 ప్రాసెస‌ర్‌, రేర్‌, ఫ్రంట్ కెమెరాలు రెండింటికి 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్లు ఉంటాయ‌ని భావిస్తున్నారు. 8000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంద‌ని చెబుతున్నారు. యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్‌తో మార్కెట్‌లోకి రానున్న‌ది. వై-ఫై, సెల్యూల‌ర్ క‌నెక్ష‌న్ వ‌ర్ష‌న్లు మాత్ర‌మే ఉంటాయని చెబుతున్నారు.

ఇంత‌కుముందు మార్కెట్లోకి వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ పాడ్ (OnePlus Pad) టాబ్లెట్ 11.67- అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 144హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఆప్ష‌న్ ఉంట‌ది. డోల్బీ విజ‌న్ ఆట్మోస్‌తోపాటు ఆండ్రాయిడ్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెస‌ర్ వినియోగించారు.

First Published:  3 Oct 2023 5:45 AM GMT
Next Story