Telugu Global
Science and Technology

OnePlus Nord CE 4 | వ‌న్‌ప్ల‌స్ నుంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

OnePlus Nord CE 4 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

OnePlus Nord CE 4 | వ‌న్‌ప్ల‌స్ నుంచి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

OnePlus Nord CE 4 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ (OnePlus) త‌న వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. 100వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ (100W SuperVOOC fast Charging) మ‌ద్ద‌తుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతోపాటు స్నాప్‌డ్రాగ‌న్ 7 జెన్‌3 ఎస్వోసీ (Snapdragon 7 Gen 3 SoC) ప్రాసెస‌ర్‌, 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ కెమెరాతోపాటు డ్యుయ‌ల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 (Android 14) బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 14 (OxygenOS 14) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. గ‌తేడాది వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ3 (OnePlus Nord CE 3) ఫోన్‌కు కొన‌సాగింపుగా వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్ వ‌స్తున్న‌ది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.26,999ల‌కు ల‌భిస్తుంది. డార్క్ క్రోమ్ (Dark Chrome), సెలాడోన్ మార్బుల్ (Celadon Marble) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంది. వ‌న్‌ప్ల‌స్ ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌, ఇత‌ర రిటైల్ స్టోర్ల‌లో ఈ నెల నాలుగో తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సేల్స్ ప్రారంభం అవుతుంది.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్ ఆండ్రాయిడ్ 14 (Android 14) బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 14 (OxygenOS 14) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,412 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 7 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుందీ ఫోన్‌. గేమింగ కోసం ఎక్స్-యాక్సిస్ లినియ‌ర్ మోటార్ జ‌త చేశారు.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ600 సెన్స‌ర్ కెమెరా విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌)తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. దీంతోపాటు 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. వ‌న్‌ప్ల‌స్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంది. 256 జీబీ స్టోరేజీ కెపాసిటీని మైక్రో ఎస్డీకార్డ్ ద్వారా ఒక టిగా బైట్‌కు పెంచుకోవ‌చ్చు.

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్ 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్‌, గ్లోనాస్‌, బీడీఎస్‌, క్యూజ‌డ్ఎస్ఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. యాక్సెల‌రో మీట‌ర్‌, ఈ-కంపాస్‌, యాంబియెంట్ లైట్‌, గైరోస్కోప్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ ఉంటాయి.

హి-రెస్ (Hi-Res) ఆడియో మ‌ద్ద‌తుతో వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ డ్యుయ‌ల్ స్టీరియో స్పీక‌ర్లు క‌లిగి ఉంటుంది. 100వాట్ల సూప‌ర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్ద‌తుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. 15 నిమిషాల చార్జింగ్‌తో ఒక రోజు బ్యాట‌రీ లైఫ్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాట‌రీ 29 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. నాలుగేండ్ల‌పాటు బ్యాట‌రీ చార్జింగ్ సైకిల్స్ కోసం బ్యాట‌రీ హెల్త్ ఇంజిన్ టెక్నాల‌జీ (Battery Health Engine technology) అందిస్తుంది.

First Published:  2 April 2024 6:52 AM GMT
Next Story