Telugu Global
Science and Technology

త్వరలోనే వన్‌ప్లస్ 12 లాంఛ్.. స్పెషల్ ఫీచర్లివే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి ‘వన్‌ప్లస్ 12’ ఫోన్ రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి లాంఛ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

త్వరలోనే వన్‌ప్లస్ 12 లాంఛ్.. స్పెషల్ ఫీచర్లివే!
X

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి ‘వన్‌ప్లస్ 12’ ఫోన్ రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి లాంఛ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

వన్‌ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జనవరి 23న ఢిల్లీలో రాత్రి 7:30 గంటలకు జరుగనుంది. వన్‌ప్లన్ నుంచి రిలీజవ్వబోతున్న లెటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ కావడంతో ఈ ఫోన్ కోసం చాలామంది వన్‌ప్లస్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

వన్‌ప్లన్ నుంచి రిలీజైన వన్‌ప్లస్ , వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 11 సిరీస్‌లు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయిన ‘వన్‌ప్లస్ 12’ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతోంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. జనవరి 23న ఇండియాతో సహా యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాంచ్ కానుంది.

వన్‌ప్లస్ 12 ఫోన్‌లో సరికొత్త ఏఐ చిప్ ఉండబోతుందని టాక్. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌‌కు కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 6.7-అంగుళాల స్క్రీన్.. 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. అమోలెడ్ క్యూహెచ్‌డీ 4కె డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2600 నిట్‌ల మ్యాగ్జిమం బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.

ఎప్పటిలాగేనే బెటర్ కెమెరా పెర్ఫామెన్స్ కోసం ఇందులో హాసల్ బ్లేడ్ సెన్సర్‌‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు అమర్చారు. అలాగే ఈ ఫోన్‌లో100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,400ఎంఎహెచ్ బ్యాటరీ ఉండబోతోంది. ఇది లాంగ్ టైం బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇక ధర విషయానికొస్తే.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 65,000 ఉండొచ్చు

వన్‌ప్లస్12 లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ 3, వన్‌ప్లస్ 12 ఆర్ మొబైల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

First Published:  22 Jan 2024 11:21 AM GMT
Next Story