Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో ఆఫ్‌లైన్ షేరింగ్ ఫీచర్! ఎలా పనిచేస్తుందంటే..

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ఫైల్స్ షేరింగ్‌కు సంబంధించి మరో కొత్త ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది.

వాట్సాప్‌లో సరికొత్త లాక్ ఫీచర్లు!
X

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ఫైల్స్ షేరింగ్‌కు సంబంధించి మరో కొత్త ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది. ఇదెలా పనిచేస్తుందంటే..

ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ షేర్ చేసేందుకు వీలుగా వాట్సాప్ ‘నియర్ బై షేర్’ అనే కొత్త ఫీచర్‌‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ సాయంతో​ వాట్సాప్ యూజర్లు తమకు దగ్గర్లో ఉన్నవారికి ఇంటర్నెట్ లేకుండానే ఫొటోలు, వీడియోలు ఈజీగా షేర్ చేసుకోవచ్చు.

దగ్గర్లో ఉన్న డివైజెస్‌కు ఫైల్స్ షేర్ చేసే యాప్స్ కొన్ని ఇప్పటికే ఉన్నాయి. డేటా కేబుల్స్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్ అవసరం లేకుండా డివైజ్‌ టు డివైజ్‌ కనెక్టివిటీతో ఆఫ్‌లైన్‌ ద్వారానే ఫైల్స్‌ షేర్‌ చేసే టెక్నాలజీ ఇది. మొబైల్‌లో ఇంటర్నల్‌గా ఉండే హాట్‌స్పాట్ నెట్‌వర్క్ షేరింగ్ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్‌ కూడా తీసుకురాబోతోంది. ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి డివైజ్‌ను షేక్ చేస్తే.. దగ్గరగా ఉన్న వాట్సాప్ యూజర్‌‌కు షేరింగ్ రిక్వెస్ట్‌ వెళుతుంది. యాక్సెప్ట్ చేయడం ద్వారా రెండు డివైజ్‌లు ఆఫ్‌లైన్‌లో కనెక్ట్ అవుతాయి. అలా వాట్సాప్ యూజర్లు తమకు దగ్గర్లో ఉన్నవారికి ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ వంటివి పంపుకోవచ్చు. ఈ ఫీచర్ యాపిల్​ ఫోన్లలో ఉండే ఎయిర్​డ్రాప్​ ఫీచర్‌‌లాగా పనిచేస్తుంది.

వాట్సా్ప్ నియర్ బై షేరింగ్‌లో హై ఎండ్ సెక్యూరిటీ ఉంటుందని, ఎండ్​-టు-ఎండ్ ఎన్​క్రిప్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. కాంటాక్ట్స్ లిస్ట్‌లో లేనివాళ్లతో ఈ ఫీచర్ పనిచేయదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ 2.24.2.17 బీటా వెర్షన్​లో ఇది పనిచేస్తోంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

First Published:  25 Jan 2024 5:00 AM GMT
Next Story