Telugu Global
Science and Technology

ఫ్రీగా నథింగ్ ఫోన్.. కార్ల్‌పై ఆఫర్!

క్రిస్మస్ దగ్గరకొస్తున్న సందర్భంగా నథింగ్ సీఈఓ కార్ల్‌పై శాంతాక్లాజ్ ఆఫర్ ఇచ్చాడు. మంచి మీమ్ షేర్ చేసినవాళ్లకు నథింగ్ ఫోన్ 1 ఉచితం అని ట్వీట్ చేశాడు.

ఫ్రీగా నథింగ్ ఫోన్.. కార్ల్‌పై ఆఫర్!
X

క్రిస్మస్ దగ్గరకొస్తున్న సందర్భంగా నథింగ్ సీఈఓ కార్ల్‌పై శాంతాక్లాజ్ ఆఫర్ ఇచ్చాడు. మంచి మీమ్ షేర్ చేసినవాళ్లకు నథింగ్ ఫోన్ 1 ఉచితం అని ట్వీట్ చేశాడు.

గతంతో వన్‌ప్లస్ కో ఫౌండర్ గా ఉన్న కార్ల్‌పై.. 'నథింగ్' అనే కొత్త బ్రాండ్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్ సందర్భంగా కార్ల్‌పై ఓ ట్వీట్ చేశాడు. మీరు బాగా చిలిపా? స్మార్టా? అయితే తమ స్మార్ట్‌ఫోన్‌ ఫ్రీ అన్నట్టుగా కార్ల్ పై చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. "రాబోయే 24 గంటల్లో వచ్చే బెస్ట్‌ మీమ్‌కి నథింగ్ ఫోన్1" అంటూ కార్ల్‌పై ట్వీట్‌ చేశారు.

కార్ల్‌పై.. తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ ఇంటరాక్ట్‌ అవుతూ వాళ్లతో ఎక్కువగా టచ్‌లో ఉంటాడు. ఇటీవల లండన్‌లోని సోహోలో కంపెనీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో భాగంగా కొంతమందికి ఫ్రీగా నథింగ్‌ ప్రొడకక్ట్స్‌ అందించారు. ఈ ఏడాది నథింగ్ నుంచి విడుదలైన 'నథింగ్ ఫోన్ 1' బాగానే సక్సెస్ అయింది.

యూకే బేస్డ్ స్టార్టప్ కంపెనీ నథింగ్ తీసుకొచ్చిన మొదటి ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అలాగే ఈ ఫోన్‌ 'ఎరీనా బెస్ట్‌ డిజైన్‌ ఫోన్‌ 2022' అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అలా కాకుండా ఉచితంగా పొందాలంటే కార్ల్‌పైని ఇంప్రెస్ చేసేలా మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి.

First Published:  17 Dec 2022 12:46 PM GMT
Next Story