Telugu Global
Science and Technology

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా మరికొన్ని అప్‌డేట్స్‌ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వాట్సాప్ లుక్ పూర్తిగా మారిపోనుందని వార్తలొస్తున్నాయి.

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
X

కొత్త థీమ్, బిజినెస్ ఇండికేటర్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా మరికొన్ని అప్‌డేట్స్‌ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వాట్సాప్ లుక్ పూర్తిగా మారిపోనుందని వార్తలొస్తున్నాయి. అలాగే బిజినెస్ ఇండికేటర్ పేరుతో మరో ఫీచర్ కూడా రాబోతోందట. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

రోజురోజుకీ అప్‌డేట్ అవుతూ.. మెసేజింగ్ యాప్స్‌లో టాప్‌లో ఉంటూ వస్తోంది వాట్సాప్. అయితే వాట్సాప్ మొదలైనప్పట్నుంచి యాప్ అప్పియరెన్స్‌లో పెద్దగా మార్పు రాలేదు. గ్రీన్ కలర్ థీమ్ నుంచి చాట్ ఇంటర్‌‌ఫేస్ వరకూ సేమ్ లుక్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు వాట్సాప్ లుక్ పూర్తిగా మారిపోనుందట. ‘మెటీరియల్ డిజైన్ 3’ బేస్డ్ థీమ్‌తో వాట్సాప్‌ విజువల్‌ రీఫ్రెష్‌ ఇంటర్‌ఫేస్‌ను డిజైన్ చేస్తోంది. అంటే ఇకపై వాట్సాప్ యాప్ కొత్తగా కనిపిస్తుందన్న మాట.

రీసెంట్‌గా కమ్యూనిటీస్‌, ఛానెల్స్‌ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. వాటికి తగ్గట్టు యాప్ ఇంటర్‌‌ఫేస్‌లో కొన్ని మార్పులు చేసింది. కానీ, ఓవరాల్ లుక్ మాత్రం మొదట్నుంచే ఒకేటా మెయింటెయిన్ చేసింది. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ ఫీల్‌ ఇచ్చేలా ఓవరాల్ ఇంటర్‌ఫేస్‌ను మార్చబోతోంది. ఈ సరికొత్త డిజైన్‌లో చాట్ ఏరియాలో కనిపించే గ్రీన్-కలర్ బార్‌‌కు బదులు లేటెస్ట్ డిజైన్ ఉంటుందట. ఐకాన్స్ లుక్ కూడా మారిపోనుంది. వాట్సాప్‌ చాట్ బబుల్స్, ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌, డార్క్, లైట్ థీమ్స్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్.. ఇలా వాట్సాప్‌కు మోడర్న్ లుక్ తీసుకొచ్చే పనిలో ఉంది మెటా సంస్థ. ఈ కొత్త లుక్ రాబోయే అప్‌డేట్‌తో మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత అందరి యూజర్లకు అప్లై అవుతుంది.

దీంతోపాటు వాట్సాప్.. ‘బిజినెస్ ఇండికేటర్స్’ అనే మరో ఫీచర్‌‌ను డెవలప్ చేస్తోంది. వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం దీన్ని రూపొందిస్తున్నారు. వాట్సాప్ బిజినెస్ యూజర్లు తమ కస్టమర్లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి నేరుగా వాట్సాప్‌లోకి రీడైరెక్ట్ చేసే విధంగా ఈ ఫీచర్ సాయపడుతుంది. అలాగే బిజినెస్ యూజర్లు కస్టమర్లకు పర్సనలైజ్డ్‌ యాడ్స్, ఆఫర్స్‌, ఫీడ్‌బ్యాక్ వంటివి అందించడానికి కూడా ఈ టూల్ హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

First Published:  15 Oct 2023 7:00 AM GMT
Next Story