Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో కొత్త సెర్చ్ బార్, ఫేస్ లాగిన్ ఫీచర్లు!

ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా రెండు కీలక అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. స్టేటస్ అప్డేట్స్‌, ఛానెల్ కోసం సెర్చ్ బార్‌‌తో పాటు, పాస్ కీ, ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వంటి సెక్యూరిటీ ఆప్షన్లను యాడ్ చేసింది.

వాట్సాప్‌లో రిప్లై బార్, కనెక్షన్ హెల్త్ ఫీచర్స్! ఎలా పనిచేస్తాయంటే..
X

వాట్సాప్‌లో రిప్లై బార్, కనెక్షన్ హెల్త్ ఫీచర్స్! ఎలా పనిచేస్తాయంటే..

ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా రెండు కీలక అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. స్టేటస్ అప్డేట్స్‌, ఛానెల్ కోసం సెర్చ్ బార్‌‌తో పాటు, పాస్ కీ, ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వంటి సెక్యూరిటీ ఆప్షన్లను యాడ్ చేసింది. ఇవెలా పని చేస్తాయంటే..

వాట్సాప్‌లో చాట్ ట్యాబ్ పక్కన ఉండే అప్‌డేట్స్ ట్యాబ్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేసేందుకు కొత్త సెర్చ్ బార్‌‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్‌. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.23.21.7 అప్‌డేట్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాపిల్ యూజర్లు వాట్సాప్ 23.21.1.72 అప్‌డేట్‌తో ఈ ఫీచర్ పొందొచ్చు. ఈ కొత్త సెర్చ్ బార్ సాయంతో వాట్సాప్‌లోని స్టేటస్ అప్‌డేట్స్‌తో పాటు ఛానెల్స్‌లోని కంటెంట్‌ను కూడా సెర్చ్ చేయొచ్చు.

వాట్సాప్ యూజర్లు అకౌంట్‌కు లాగిన్ అవ్వడానికి ‘పాస్‌కీ’ అనే కొత్త ఫీచర్ ను కూడా రాబోతోంది. ఇది పాస్‌వర్డ్ లాంటిది కాదు. ‘పాస్‌కీ’ అనేది వాట్సాప్ సర్వర్‌కు బదులుగా యూజర్ ఫోన్‌లో స్టోర్ అవుతుంది. అంతేకాదు పాస్‌కీ గా ఫోన్ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ స్కానర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ‘పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ’ అనే ప్రత్యేక టెక్నాలజీలో పాస్‌కీలు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అంటే యూజర్, మొబైల్ ఓఎస్ మాత్రమే పాస్‌కీ ని యాక్సెస్ చేయగలవు. వాట్సాప్ సర్వర్‌ హ్యాక్ అయినా కూడా పాస్‌ కీ తో సేఫ్ గా ఉండొచ్చు. వేగంగా అలాగే సేఫ్‌గా అకౌంట్ లాగిన్ చేసేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చినట్టు వాట్సాప్ చెప్తోంది. ఓటీపీ, పిన్‌ల కంటే పాస్‌కీనే ఎక్కువ సురక్షితమైనవని వాట్సాప్ అంటోంది. వాట్సాప్‌లో ‘పాస్ కీ లాగిన్’ పెట్టుకునేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘అకౌంట్’పై క్లిక్ చేస్తే ‘పాస్‌కీస్’ అని కనిపిస్తుంది. అక్కడ ‘క్రియేట్ పాస్‌కీ’ నొక్కి.. కీ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఇకపోతే అవతలి వాళ్లు మీ ఫోన్ నంబర్‌ తెలియకుండానే చాట్ చేసే విధంగా ‘యూజర్‌నేమ్స్’ అనే ఫీచర్ కూడా త్వరలో రాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.

First Published:  19 Oct 2023 7:00 AM GMT
Next Story