Telugu Global
Science and Technology

కొత్తగా వచ్చిన ఓటీపీ స్కామ్.. సేఫ్‌గా ఉండేందుకు టిప్స్ ఇవే..

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని సరికొత్త స్కామ్‌లు కనిపెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్ చాలామందిని భయపెడుతోంది.

కొత్తగా వచ్చిన ఓటీపీ స్కామ్.. సేఫ్‌గా ఉండేందుకు టిప్స్ ఇవే..
X

మనదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షాపుల్లో కంటే ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువమంది షాపింగ్ చేస్తుంటారు. ఇలా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లను టార్గెట్ చేసుకుని సరికొత్త స్కామ్‌లు కనిపెడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్ చాలామందిని భయపెడుతోంది. ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే..


ట్రాన్సాక్షన్స్ సేఫ్‌గా జరిపేందుకు సంస్థలు ఓటీపీలు పంపిస్తుంటాయి. దాదాపు అన్ని పేమెంట్లు ఇప్పుడు ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఈ ఓటీపీని ఆధారం చేసుకుని కొన్ని స్కామ్స్ కూడా జరుగుతున్నాయి.


అయితే ఈ స్కామ్ ఆన్‌లైన్ ద్వారా కాదు, ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. ఈ స్కామ్‌లో.. ఈ కామర్స్ కంపెనీకి చెందిన డెలివరీ బాయ్‌లా ఒకతను ఇంటికి వస్తాడు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయకపోయినా.. ఏదో ఆర్డర్ వచ్చిందని నమ్మిస్తాడు. ఆర్డర్ డెలివరీ చేసేందుకు ఓటీపీ చెప్పమని అడుగుతాడు.


ఆర్డర్ వద్దు అని చెప్పినా.. ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ చెప్పమని అడుగుతాడు. ఇదంతా స్కామ్ అని తెలియక ఓటీపీ చెప్పేస్తే.. ఇక అంతే సంగతి. షేర్‌ చేసిన ఓటీపీతో బ్యాంక్‌ వివరాలు కాజేస్తారు.

అందుకే ఆర్డర్ చేయకపోయినా డెలివరీ ఇవ్వడానికి ఎవరైనా వస్తే.. ఆర్డర్ నెంబర్, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ వివరాలు కనుక్కుని నిజంగా ఆర్డర్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. వచ్చిన అతను స్కామర్ అన్న అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.


నిజమైన డెలివరీల టైంలో వచ్చే ఓటీపీలు పిన్ రూపంలో ఉంటాయి. ఆ మెసేజ్‌లు డెలివరీ కంపెనీల అఫీషియల్ ఐడీతో వస్తాయి. డెలివరీలు తీసుకునే టైంలో ఇవన్నీ సరిచూసుకోవాలి. అలాగే బయట జరుగుతున్న రకకరాల సైబర్ స్కామ్‌ల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేటేడ్‌గా ఉండాలి. అప్పుడే సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడొడచ్చు.

First Published:  23 Feb 2023 6:17 AM GMT
Next Story