Telugu Global
Science and Technology

కొత్త మొబైల్స్ అప్‌డేట్స్‌!

Best phone under 20000 in India: శాంసంగ్, లావా, వన్‌ప్లస్ నుంచి రీసెంట్‌గా కొన్ని బడ్జెట్ ఫొన్లు, మరికొన్ని ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.

New Mobiles Updates
X

New Mobiles Updates

శాంసంగ్, లావా, వన్‌ప్లస్ నుంచి రీసెంట్‌గా కొన్ని బడ్జెట్ ఫొన్లు, మరికొన్ని ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అలాగే కొన్ని మొబైల్స్‌ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వాటి ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేస్తే..

సౌత్ కొరియాకు చెందిన సంస్థ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో అదరగొడుతుంది. తాజాగా గెలాక్సీ ఎస్ సిరీస్ నుంచి మరో ప్రీమియం మొబైల్ తీసుకొస్తోంది. 'గెలాక్సీ ఎస్23' పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. 12-మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రిలీజ్ అవ్వబోతోంది.

శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ మొబైల్ కూడా తాజాగా అమెజాన్‌లో సేల్‌కు రెడీ అయింది. 'గెలాక్సీ ఎఫ్13' పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999గా ఉంది. డిస్కౌంట్లు, ఆఫర్లతో ఇంకా తక్కువకు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.6 ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెకండరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

దేశీయ మొబైల్ కంపెనీ లావా రీసెంట్‌గా బడ్జెట్ 5జీ ఫోన్ తీసుకొచ్చించి. భారత మార్కెట్‌లో నవంబర్ 7న లావా బ్లేజ్ 5జీ ఫోన్ విడుదలైంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వాటర్-డ్రాప్ స్టైల్ నాచ్ , 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధర రూ. 9,999 గా ఉంది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ రాబోతుంది. 'వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3' పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా ఉండబోతోంది. ఇది పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్‌ 965 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది .67 వాట్ ఫాస్ట్‌చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రావొచ్చు.

First Published:  13 Nov 2022 6:23 AM GMT
Next Story