Telugu Global
Science and Technology

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్లు!

రోజురోజుకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చాట్‌జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్లు!
X

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్లు!

రోజురోజుకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చాట్‌జీపీటీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన చాట్‌జీపీటీలో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ అవ్వనున్నాయి. ఇప్పటివరకూ టెక్స్ట్ రూపంలో ఇన్‌పుట్ తీసుకుని సమాధానాలు ఇచ్చే చాట్‌జీపీటీ.. ఇకపై ఫోటోల రూపంలో కూడా సలహాలు ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఓపెన్ఏఐ’ తన ఎక్స్(ట్విటర్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ సమస్యకు సంబంధించిన ఫోటో చాట్‌జీపీటీలో షేర్ చేసి సమస్య గురించి వివరిస్తే.. చాట్‌జీపీటీ దాన్ని పరిశీలించి సొల్యూషన్ ఇస్తుంది. రీసెంట్‌గా ఒక వ్యక్తి ‘సైకిల్ సీటు తగ్గించడానికి ఏమి చేయాలి?’ అని సైకిల్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసి అడిగితే చాట్‌జీపీటీ దానికి ఆన్సర్ చెప్పింది.

దీంతోపాటు చాట్‌జీపీటీలో యూజర్ ఇంటరాక్షన్‌కు సంబంధించి మరో అప్‌డేట్ కూడా వచ్చింది. చాట్‌జీపీటీలో టెక్స్ట్ రూపంలో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చాట్‌జీపీటీ దానికి ఆన్సర్ ఇచ్చే వరకూ వేచి ఉండాలి. మధ్యలో ఏదైనా అడగాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా చాట్‌జీపీటీ సమాధానం చెప్పే సమయంలో మధ్యలో కల్పించుకుని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వొచ్చు.

ఇకపోతే చాట్‌జీపీటీలో రియల్ టైం సమాచారం ఉండదని అందరికీ తెలిసిందే. 2021 వరకూ ఉన్న సమాచారాన్ని మాత్రమే అనలైజ్ చేసి ఆన్సర్స్‌ ఇస్తుంది. అయితే ఇకనుంచి రియ‌ల్ టైం స‌మాచారం కూడా అంద‌జేస్తామ‌ని ‘ఓపెన్‌ఏఐ’ సంస్థ వెల్లడించింది. రీసెంట్ విషయాలకు సంబంధించి ఏదైనా స‌మాచారం అడిగితే ఇంట‌ర్నెట్‌లో శోధించి మ‌రీ స‌మాచారం ఇస్తుందట. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఐఫోన్లతోపాటు వెబ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఈ ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.

First Published:  4 Oct 2023 1:23 PM GMT
Next Story