Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్‌తో లాగిన్!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ ఫీచర్.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్‌తో లాగిన్!
X

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్‌తో లాగిన్!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ ఫీచర్. ఇదెలా పనిచేస్తుందంటే..

డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ప్రైవసీని అప్‌డేట్ చేస్తూ కొత్తగా పాస్‌వర్డ్ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్. ఇకపై డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వ‌ర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల యూజ‌ర్ల చాటింగ్‌కు అడిష‌న‌ల్ సేఫ్టీ ఉంటుంద‌ని వాట్సాప్ చెప్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచ‌ర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

డెస్క్‌టాప్‌లో వాట్సాప్ యూజర్లు గత కొంతకాలంగా తమ ప్రైవసీపై ఆందోళన పడుతున్నారు. అందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. మొబైల్ యాప్ మాదిరిగానే డెస్క్‌టాప్ యాప్‌కు కూడా స్క్రీన్ లాక్ ఫీచ‌ర్ తీసుకొస్తోంది. ఇక నుంచి డెస్క్‌టాప్‌లో వాట్సా్ప్ యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడ‌ల్లా పాస్‌వ‌ర్డ్ ఎంటర్ చేయాల్సిందే. ఈ ఫీచర్ పాస్‌వ‌ర్డ్‌తోపాటు ఫింగ‌ర్ ప్రింట్ సేఫ్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. కంప్యూట‌ర్ లేదా లాప్‌టాప్ యూజ‌ర్లు త‌మ వాట్సాప్ యాప్‌కు ఫింగ‌ర్ ప్రింట్ లాక్ పెట్టుకోవ‌చ్చు.

ఇకపోతే వాట్సాప్ తమ యూజర్ల కోసం మరోకొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్ యాప్‌లో కేటగిరీల వారీగా బిజినెస్‌లను సెర్చ్ చేసే ఫీచర్‌‌ను తీసుకొస్తోంది. అంటే ఇకపై దగ్గరలోని షాపులు, రెస్టారెంట్లు వంటివాటిని వాట్సా్ప్‌లోనే సెర్చ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో భారత యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

First Published:  21 Nov 2022 1:00 PM GMT
Next Story