Telugu Global
Science and Technology

Motorola Edge 50 Ultra | త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!

Motorola Edge 50 Ultra | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా (Motorola) త‌న మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Motorola Edge 50 Ultra | త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
X

Motorola Edge 50 Ultra | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా (Motorola) త‌న మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో త్వ‌ర‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. మోట‌రోలా ఎడ్జ్ ఫ్యూజ‌న్ (Motorola Edge 50 Fusion)తోపాటు మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను గ‌త ఏప్రిల్‌లో గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం భార‌త్ మార్కెట్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 ఫ్యూజ‌న్ (Motorola Edge 50 Fusion) ఫోన్ అందుబాటులో ఉంది. ఇదే సిరీస్‌లో త్వ‌ర‌లో టాప్ ఆప్ లైన్ మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ (Snapdragon 8s Gen 3 SoC) ప్రాసెస‌ర్‌, వైర్డ్ అండ్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. గ‌త ఏప్రిల్‌లో భార‌త్ మార్కెట్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 లైనప్‌లో మోట‌రోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్‌ను ఆవిష్క‌రించారు. ఇక గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌లో వాడిన ఫీచ‌ర్లనే భార‌త్‌లోనూ ఆవిష్క‌రించే ఫోన్‌లో వినియోగిస్తార‌ని భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ ధ‌ర ఎంత అన్న‌ది ఇంకా వెల్ల‌డి కాలేదు.

మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7- అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పోలెడ్ స్క్రీన్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8s Gen 3 SoC) ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ యూఎఫ్ఎస్ 4.0 ఆన్ బోర్డు స్టోరేజీ సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌.

మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తోంది. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) మ‌ద్ద‌తుతో 50 -మెగా పిక్సెల్ ప్రైమ‌రీ రేర్ సెన్స‌ర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 64-మెగా పిక్సెల్ టెలిఫోటో షూట‌ర్ విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50 - మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటాయి.

మోట‌రోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్ 125వాట్ల వైర్డ్‌, 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4,500 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. డ్యుయ‌ల్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్‌, గ్లోనాస్‌, గెలీలియో, బైదూ, నేవ్ ఐసీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్, సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంటుంది. ఐపీ 68 రేటింగ్ ఫ‌ర్ డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ క‌లిగి ఉంటుంది.

First Published:  8 Jun 2024 12:30 AM GMT
Next Story