Telugu Global
Science and Technology

మిడ్‌రేంజ్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే! మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో! ఫీచర్లివే..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా నుంచి ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ మొబైల్ లాంఛ్ అయింది. అట్రాక్టివ్ డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్‌గా నిలువనుంది.

మిడ్‌రేంజ్‌లో కర్వ్‌డ్ డిస్‌ప్లే! మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో! ఫీచర్లివే..
X

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా నుంచి ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ మొబైల్ లాంఛ్ అయింది. అట్రాక్టివ్ డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్‌గా నిలువనుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

మోటొరోలా ఎడ్జ్‌ సిరీస్‌లో భాగంగా ‘మోటో ఎడ్జ్‌ 50 ప్రో’ రీసెంట్‌గా ఇండియన్‌ మార్కెట్‌లో లాంఛ్ అయింది. ఈ ఫోన్.. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ హలో యూఐపై రన్ అవుతుంది. మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్.. అంటే ఆండ్రాయిడ్‌ 17 వరకు అప్‌డేట్స్‌ ఇస్తామని, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెప్తోంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రోలో అమర్చిన కర్వ్‌డ్ డిస్ ప్లేను ఈ ఫోన్‌కు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో 6.7 అంగుళాల 1.5కె పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్‌ చేస్తుంది. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ బ్రైట్‌గా కనిపిస్తుంది.

మోటో ఎడ్జ్ 50 ప్రో కెమెరాల విషయానికొస్తే.. ఇందులో వెనుక ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ కలిగిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఇందులో అమర్చిన 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 125వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, 50 వాట్ వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో 5జీ కనెక్టివిటీ, డ్యుయల్ నానో సిమ్, బ్లూటూత్ 5.0, యూ ఎఫ్ ఎస్ 2.2 స్టోరేజీ, వైఫై6ఈ, డాల్బీ అట్మాస్ స్పీకర్స్ వంటి ఫీచర్లున్నాయి.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో ధరల విషయానికొస్తే.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.35,999గా ఉన్నాయి. లాంఛింగ్ ఆఫర్ కింద బేస్‌ వేరియంట్‌ను రూ.27,999కే కొనుగోలు చేయొచ్చు. ఏప్రిల్‌ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటొరోలా ఆన్‌లైన్‌ స్టోర్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌ బ్యూటీ, లక్స్‌ లావెండర్‌, మూన్‌లైట్‌ పెరల్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

First Published:  10 April 2024 12:30 AM GMT
Next Story