Telugu Global
Science and Technology

Motorola Edge 40 Neo | 21న మోట‌రోలా ప్రీమియం ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Motorola Edge 40 Neo | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా.. మీడియం రేంజ్‌లో మ‌రో ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్‌ను ఈ నెల 21న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Motorola Edge 40 Neo | 21న మోట‌రోలా ప్రీమియం ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Motorola Edge 40 Neo | 21న మోట‌రోలా ప్రీమియం ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో ఆవిష్క‌ర‌ణ‌.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Motorola Edge 40 Neo | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా.. మీడియం రేంజ్‌లో మ‌రో ఫోన్ మోట‌రోలా ఎడ్జ్‌40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్‌ను ఈ నెల 21న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది. మోట‌రోలా ఎడ్జ్‌40 (Motorola Edge 40) తోపాటు మోట‌రోలా ఎడ్జ్‌40 ప్రో (Motorola Edge 40 Pro) కూడా గ‌త ఏప్రిల్‌లో గ్లోబ‌ల్ మార్కెట్లో ఆవిష్క‌రించారు. మోట‌రోలా ఎడ్జ్‌40నియో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ (MediaTek Dimensity 7030 SoC) చిప్‌సెట్‌, 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ (5,000mAh battery) గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో వ‌చ్చిన మోట‌రోలా ఎడ్జ్ 30 కొన‌సాగింపుగా మోట‌రోలా ఎడ్జ్‌40 నియో వ‌స్తోంది.

బ్లాక్ బ్యూటీ, కానీల్ బే, సూథింగ్ సీ క‌ల‌ర్స్‌వేలో మోట‌రోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) వ‌స్తున్న‌ది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.35,400 ధ‌ర ప‌లుకుతుంది. ప్ర‌స్తుతం యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్‌, ఆఫ్రికా దేశాల్లో ల‌భిస్తున్న‌ది.

6.55-అంగుళాల పోలెడ్ డిస్‌ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉన్న మోట‌రోలా ఎడ్జ్‌40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌-3 (Corning Gorilla Glass 3) ప్రొటెక్ష‌న్ తో వ‌స్తున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ చిప్ సెట్‌తో వ‌స్తున్న ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మైయూఎక్స్ ఓఎస్ (Android 13-based MyUX OS) వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది.

మోట‌రోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) స‌పోర్ట్‌, 13-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

మోట‌రోలా ఎడ్జ్‌40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. 5జీ, 4జీ, వై-ఫై, బ్లూ టూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది.

First Published:  15 Sep 2023 7:59 AM GMT
Next Story