Telugu Global
Science and Technology

Moto Edge 40 - G54 | మోటో ఎడ్జ్‌40.. మోటో జీ54 5జీ ఫోన్ల‌పై మోట‌రోలా డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్‌..!

Moto Edge 40 - G54 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా ఇటీవ‌ల త‌న బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధ‌ర త‌గ్గించింది.

Moto Edge 40 - G54 | మోటో ఎడ్జ్‌40.. మోటో జీ54 5జీ ఫోన్ల‌పై మోట‌రోలా డిస్కౌంట్లు.. ఇవీ డిటైల్స్‌..!
X

Moto Edge 40 - G54 | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ మోట‌రోలా ఇటీవ‌ల త‌న బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధ‌ర త‌గ్గించింది. తాజాగా త‌న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్‌40 ఫోన్ ధ‌ర‌పై డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. గ‌తేడాది మే నెల‌లో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన మోటో ఎడ్జ్ 40 ఫోన్ ధ‌ర రూ.29,999. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ రూ.3,000 డిస్కౌంట్‌పై ల‌భిస్తుంది. అంటే మోటో ఎడ్జ్‌40 ఫోన్ రూ.26,999ల‌కే ల‌భ్యం అవుతుంది. నాలుగు క‌ల‌ర్ ఆప్ష‌న్లు - వివా మెజింటా, ఎక్లిప్స్ బ్లాక్‌, నెబుల్లా గ్రీన్‌, లునార్ బ్లూ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. దీనికి తోడు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డుల‌పై కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఈవీ మోటో ఎడ్జ్‌40 స్పెషిఫికేష‌న్స్‌

మోటో ఎడ్జ్‌40 5జీ ఫోన్ 6.66 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పోలెడ్ డిస్‌ప్లే విత్ 1080x2400 పిక్సెల్స్ రిజొల్యూష‌న్‌తో వ‌స్తుంది. గ‌రిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తోపాటు 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌తో వైబ్రంట్, స్మూత్ విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ ల‌భిస్తుంది. ఓక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో వ‌చ్చింది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌.

మోటో ఎడ్జ్‌40 5జీ ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తుంది. ఓఐఎస్‌తో 50-మెగా పిక్సెల్ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/1.4 అపెర్చ‌ర్‌, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఫీచ‌రింగ్ ఎఫ్‌/2.2 అపెర్చ‌ర్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. డోల్బీ ఆట్మోస్‌తోపాటు ఆడియో కాప్చ‌ర్ కోసం మూడు మైక్రో ఫోన్ల‌తో స్టీరియో స్పీక‌ర్ల ఆడియో ఎక్స్‌పీరియ‌న్స్ పెరుగుతుంది. బ‌యోమెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంటుంది. వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, వై-ఫై 6కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది.

మాల్‌వేర్ అటాక్‌, ఫిషింగ్ వంటి సైబ‌ర్ దాడుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల‌కు థిక్ షీల్డ్ షూట్ ఉంటుంది. 15వాట్ల వైర్‌లెస్ చార్జింగ్, 5వాట్ల రివ‌ర్స్ వైర్‌లెస్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది.

మోటో జీ54 5జీపై ఇలా డిస్కౌంట్‌

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో తీసుకొచ్చిన మోటో జీ54 5జీ ఫోన్‌పై ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ అందిస్తున్న‌ది మోట‌రోలా. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, 12 జీబీ ర్యామ్ విత్‌ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999 లాంఛింగ్ ధ‌ర‌. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.3000 ధ‌ర త‌గ్గింపుతో 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.15,999ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఈ ఫోన్ల కెపాసిటీ ఒక టిగాబైట్ వ‌ర‌కూ పొడిగించ‌వ‌చ్చు.

మోటో జీ54 5జీ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ డైన‌మిక్ రీఫ్రెష్ రేటుతో వ‌స్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్‌సెట్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్స‌ర్ కెమెరాతోపాటు డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 విత్ మై యూఎక్స్ 5.0 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుందీ ఫోన్‌. 33వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది.

First Published:  23 Jan 2024 8:15 AM GMT
Next Story