Telugu Global
Science and Technology

ఈ ఏడాది గూగుల్ చేసిన విషయాలివే...

Most searched topics on Google 2022: ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా ముందుగా అడిగేది గూగుల్‌నే. ప్రపంచం మూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసే టాపిక్స్ తెలుసుకుంటే చాలు. అందుకే.. ప్రతి ఏడాది చివర్లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది గూగుల్.

Most searched topics on google 2022
X

ఈ ఏడాది గూగుల్ చేసిన విషయాలివే...

ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా ముందుగా అడిగేది గూగుల్‌నే. ప్రపంచం మూడ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసే టాపిక్స్ తెలుసుకుంటే చాలు. అందుకే.. ప్రతి ఏడాది చివర్లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది గూగుల్. అందులో భాగంగానే 2022 గానూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సెర్చ్ చేసిన టాపిక్స్ లిస్ట్‌ను ఇటీవలే రిలీజ్ చేసింది. మరి ఈ ఏడాది ప్రపంచం వేటి గురించి ఎక్కువగా వెతికిందో తెలుసుకుందామా?

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ర్చ్ చేసిన విషయం 'హౌ టు డ్రింక్ పోర్న్‌స్టార్ మార్టిని('How to Drink Pornstar Martini). పోర్న్ స్టార్ మార్టిని అనేది కాక్‌టెయిల్ డ్రింక్ పేరు. ఈ ఏడాది ప్రపంచంలో ఎక్కువమంది సెర్చ్ చేసిన విషయం ఇదే. ఇకపోతే మనదేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన విషయం 'ఫేస్‌బుక్ ఖాతాను తొలగించడం ఎలా?' (How to delete a Facebook account) అలాగే 'ఎమోజీ' అర్థం ఏంటి ? (What is the meaning of emoji). ఈ రెండు టాపిక్స్‌ గురించి మనదేశంలో ఎక్కువమంది సెర్చ్ చేశారు.

గూగుల్‌లో వెతికిన విషయాలను కేటగిరీల పరంగా చూస్తే.. ఎవరు? (Who) అన్న పదంతో ఎక్కువగా వెతికింది 'ఆండ్రూ టేట్' గురించి. ఈయన అమెరికన్ బ్రిటిష్ ఇంటర్నెట్ పర్సనాలిటీ. మనదేశంలో మాత్రం 'భారత రాష్ట్రపతి ఎవరు?' (Who is the president of India 2022) అని సెర్చ్ చేశారు. తెలంగాణలో 'తెలుగు బిగ్‌బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరు? (Who is eliminated in Bigg Boss Six Telugu) అని సెర్చ్ చేశారు. అలాగే ' ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారు' (Who invented exams) అని కూడా చాలామంది సెర్చ్ చేశారు.

'హౌ' అన్న పదంతో సెర్చ్ చేసిన విషయాలకొస్తే.. ప్రపంచవ్యాప్తంగా 'ధనవంతుడిని కావడం ఎలా?' (How to become rich) అని ఎక్కువగా వెతికారు. అలాగే వేగంగా డబ్బులు సంపాదించే మార్గాల గురించి కూడా సెర్చ్ చేశారు. ఇక మనదేశంలో మాత్రం 'అందరినీ ఆకర్షించడం ఎలా' (How to become a people magnet) అని కొందరు, 'మిస్ యూనివర్స్ కావడం ఎలా? ( How to become miss universe) అని ఇంకొందరు సెర్చ్ చేశారు.

యూట్యూబ్‌ సెర్చ్‌ల విషయానికి వస్తే 'సన్నబడడం ఎలా?' అనేది టాప్ సెర్చ్‌గా ఉంది. ఆ తర్వాతి స్థానంలో 'సీఈవో కావడం ఎలా?' , బాధ నుంచి తప్పించుకోవడం ఎలా? ' ప్రేమించిన వారిని మర్చిపోవడం ఎలా?' అనే విషయాలు ఎక్కువమంది సెర్చ్ చేశారు.

'ఎందుకు' అనే పదాన్ని ఉపయోగించి 'ఆకాశం నీలంగా ఎందుకుంటుంది?' (Why is the sky blue?) అనే సెర్చ్ ఎక్కువమంది చేశారు. వీటితో పాటు 'ఏసీ ఎందుకు చల్లబడడం లేదు?' , 'ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు పనిచేయడం లేదు' అన్న విషయాలు కూడా సెర్చ్ చేశారు. .

ఇక వీటితో పాటు పాసూరి, హరహర శంభు, కచ్చా బాదమ్, కేసరియా పాటల గురించి ఇండియాలో ఎక్కువ మంది వెతికారు. తెలంగాలో డీజే టిల్లు, హరహర శంభు, శ్రీవల్లి, రా రా రక్కమ్మ.. పాటల గురించి ఎక్కువ సెర్చ్ చేశారు. ఈ ఏడాది బాగా వెదికిన పదాల్లో 'మునుగోడు' (Munugode) కూడా ఉంది. అలాగే ఇండియాలో ఒప్పో కె10, అమెజాన్ మినీ టీవీ, టీవీఎస్ రోనిన్, ఐఫోన్ 13, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, బ్రహ్మాస్త్ర సినిమా, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ , లతా మంగేష్కర్ గురించి కూడా ఎక్కువమంది సెర్చ్ చేశారు.

First Published:  26 Dec 2022 11:31 AM GMT
Next Story