Telugu Global
Science and Technology

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో లాప్‌టాప్‌ల‌పై బెస్ట్ ఆఫ‌ర్లు ఇవే..!

Amazon Great Indian Festival | ఐటీ విద్యార్థులు మొద‌లు సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్‌.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ స్మార్ట్ ఫోన్ ఎంత అవ‌స‌ర‌మో.. లాప్‌టాప్ కూడా అంతే అవ‌స‌రం.

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో లాప్‌టాప్‌ల‌పై బెస్ట్ ఆఫ‌ర్లు ఇవే..!
X

Amazon Great Indian Festival | ఐటీ విద్యార్థులు మొద‌లు సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్‌.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ స్మార్ట్ ఫోన్ ఎంత అవ‌స‌ర‌మో.. లాప్‌టాప్ కూడా అంతే అవ‌స‌రం. రోజుకో కొత్త టెక్నాల‌జీతో స‌రికొత్త లాప్‌టాప్‌లు మార్కెట్లోకి వ‌చ్చేస్తున్నాయి. ఆయా ఫీచ‌ర్లు, ఆప్ష‌న్ల‌ను బ‌ట్టి లాప్‌టాప్ ధ‌ర‌లు రూ.44 వేల నుంచి రూ.1.16 ల‌క్ష‌ల పై చిలుకు వ‌ర‌కూ ప‌లుకుతున్నాయి. త‌క్కువ ధ‌ర‌లో బెస్ట్ లాప్‌టాప్ కావాల‌నుకుంటే పండుగ‌ల సీజ‌న్‌లో అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్-2023 ఆఫ‌ర్లు వారం రోజులుగా అందుబాటులో ఉన్నాయి. వివిధ ధ‌ర‌ల శ్రేణిలో ల‌భిస్తున్న లాప్‌టాప్‌ల‌పై విస్తృత శ్రేణి ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి.

చౌక ధ‌ర‌కు ల‌భించే లాప్‌టాప్‌ల్లో ఇంటెల్ కోర్ ఐ3 సీపీయూ నుంచి హై ఎండ్ లాప్‌టాప్స్ విత్ శ‌క్తిమంత‌మైన ఇంటెల్ కోర్ ఐ9 ప్రాసెస‌ర్ల‌లో ల‌భిస్తున్నాయి. ప్ర‌తి బ్రాండ్ లాప్‌టాప్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌.. ఎస్బీఐ కార్డుల‌తో కొనుగోలు చేసిన వారికి అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు అందుబాటులోకి తెచ్చింది అమెజాన్‌.

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌లో లాప్‌టాప్‌ల‌పై ల‌భించే బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్‌పై ఓ లుకేద్దాం..!

డెల్ వొస్ట్రో 3520 (ఇంటెల్ కోర్ ఐ3 అండ్ 11వ జ‌న‌రేష‌న్‌) ఇలా

విస్ట్రో బ్రాండ్ లాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెస‌ర్‌తో వ‌స్తుందీ డెల్ వొస్ట్రో 3520. ఇందులో 8జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. విండోస్ 11 హోం ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. సైబ‌ర్ సెక్యూరిటీ కోసం మైకేఫ్ మ‌ల్టీ డివైజ్ సెక్యూరిటీ 15 నెల‌ల స‌బ్‌స్క్రిప్ఫ‌న్ క‌ల్పిస్తున్న‌ది. 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 41 వాట్ల బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉంటుంది. ప్ర‌స్తుతం డొల్ వెస్ట్రో 3520 లాప్‌టాప్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. దీని ధ‌ర మార్కెట్లో రూ.44,524 కాగా, ఇప్పుడు రూ.35,990ల‌కు ల‌భిస్తుంది.

ఎసేర్ ఆస్పైర్ లైట్ ఇలా

ఎసేర్ ఆస్ప్రైర్ లైట్ (Acer Aspire Lite - Intel Core i3, 11th Gen) లాప్‌టాప్‌ 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. ఈ లాప్‌టాప్ 8 జీబీ ర్యామ్‌, ఎస్ఎస్‌డీ 512 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వ‌స్తుంది. ఈ టాప్‌లో ఇంటెల్ కోర్ (Intel Core i3-1115G4 CPU- ఇంటెల్ యూహెచ్‌డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ (Intel UHD integrated graphics)తో ప‌ని చేస్తుంది. విండోస్ 11 హోం ఎడిష‌న్‌ (Windows 11 Home edition) వ‌ర్ష‌న్‌తో ప‌ని చేస్తుందీ లాప్‌టాప్‌. న‌హిమిక్ ఆడియో ట్యూన్డ్ స్పీక‌ర్లతో వ‌స్తున్న‌ది. ఈ లాప్‌టాప్ లాంచింగ్ ధ‌ర రూ.44,990 కాగా, రూ.27,990ల‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

ఎంఎస్ఐ మోడ్ర‌న్ 14 ఇలా

14-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే విత్ 60హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ గ‌ల ఎంఎస్ఐ మోడ్ర‌న్ 14 లాప్‌టాప్ 12వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ7- 1255 సీపీయూ (Intel Core i7-1255U CPU) విత్ ఇంటెల్‌ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ (Intel Iris Xe graphics) తో వ‌స్తుంది. ఈ ప్రాసెస‌ర్ 16 జీబీ ర్యామ్‌తోపాటు 512 జీబీ ఎన్వీఎంఈ ఎస్ఎస్‌డీ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. ఎంఎస్ఐ సెంట‌ర్ వ‌ద్దే విండోస్‌ 11 ప్రీ ఇన్ స్ట‌లేష‌న్ చేస్తారు. హెచ్ఐ రెస్ ఆడియో ((Hi-Res) విత్‌24-బిట్‌/ 192 కేహెచ్‌జ‌డ్ శాంప్లింగ్‌కు మ‌ద్దతుగా ఉంటుందీ లాప్‌టాప్‌. మార్కెట్‌లో రూ.78,990 ధ‌ర ప‌లుకుతున్న ఈ లాప్‌టాప్ రూ.49,990ల‌కు ల‌భిస్తుంది.

ఇలా షియోమీ నోట్‌బుక్ ఆల్ట్రా మ్యాక్స్

మీరు డిస్కౌంట్ ధ‌ర‌లో న్యూ ఆల్ట్రాబుక్ కోసం చూస్తున్న‌ట్ల‌యితే అందుకు స‌రైన ఆప్ష‌న్ షియోమీ నోట్‌బుక్ ఆల్ట్రా మ్యాక్స్‌. ఈ లాప్‌టాప్ 15.6- అంగుళాల డిస్‌ప్లే విత్ 3.2కే రిజొల్యూష‌న్, 11థ్ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ5-11320 హెచ్ ప్రాసెస‌ర్ (Intel Core i5-11320H processor) విత్ ఇంటెల్ ఐరిస్ జీ గ్రాఫిక్స్ (Intel Iris Xe Graphics) తో వ‌స్తున్న‌ది. 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. ఈ లాప్‌టాప్ ఇన్‌బిల్ట్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ క‌లిగి ఉండ‌టంతోపాటు విండోస్ 11 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. లాంచింగ్ ధ‌ర రూ.76,999 కాగా, డిస్కౌంట్‌పై రూ.46,990ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు.

అసుస్ వివో బుక్ 16 ఇలా

13వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ కోర్ ఐ9-13900 హెచ్ సీపీయూ (13th generation Intel Core i9-13900H CPU) విత్ ఇంటెల్ ఐరిష్ గ్రాఫిక్స్ (Intel Iris Xe graphics) సామ‌ర్థ్యంతో వ‌స్తున్నది అసుస్ వివో బుక్ 16 (Asus Vivobook 16 (2023). ఈ లాప్‌టాప్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. అసుస్‌ వివో బుక్ 16 (2023).. 16 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ ఉంటుంది. ఈ లాప్‌టాప్ విండోస్ 11 వ‌ర్ష‌న్ మీద ప‌ని చేస్తుంది. 2021 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వ‌ర్ష‌న్ ప్రీ ఇన్ స్ట‌ల్ చేస్తారు. మార్కెట్‌లో లాంచింగ్ ధ‌ర రూ.1,16,990 కాగా, రూ.84,990ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు.

First Published:  12 Oct 2023 9:03 AM GMT
Next Story