Telugu Global
Science and Technology

Lava Blaze 2 Pro | లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్.. లావా బ్లేజ్2 ప్రో.. ధ‌రెంతంటే..?

Lava Blaze 2 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా (Lava).. భార‌త్ మార్కెట్లోకి మ‌రో బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ తీసుకొచ్చింది. సోమ‌వారం త‌న లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) ఆవిష్క‌రించింది.

Lava Blaze 2 Pro | లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్.. లావా బ్లేజ్2 ప్రో.. ధ‌రెంతంటే..?
X

Lava Blaze 2 Pro | లావా నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్.. లావా బ్లేజ్2 ప్రో.. ధ‌రెంతంటే..?

Lava Blaze 2 Pro | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ లావా (Lava).. భార‌త్ మార్కెట్లోకి మ‌రో బ‌డ్జెట్ సెగ్మెంట్ ఫోన్ తీసుకొచ్చింది. సోమ‌వారం త‌న లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.9999గా (ఎక్స్ షోరూమ్‌) నిర్ణ‌యించారు. లావా ఇండియా వెబ్‌సైట్‌లో `లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro)` లిస్ట‌యింది. 18వాట్ల చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న లావా బ్లేజ్ 2 ప్రో ఫోన్‌..720x1600 పిక్సెల్స్ రిజొల్యూష‌న్‌, 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 2.5 డీ క‌ర్వ్‌డ్ స్క్రీన్ అండ్ 90 రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటది. మూడు రంగుల ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్‌లోకి వ‌స్తుంది. వ‌ర్చువ‌ల్‌గా మ‌రో 8జీబీ ర్యామ్ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు.

లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.9,999. మూడు క‌ల‌ర్ ఆప్ష‌న్లు -థండ‌ర్ బ్లాక్‌, స్వాగ్ బ్లూ, కూల్ గ్రీన్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై రాయితీలు కూడా అందుకోవ‌చ్చు. భార‌త్ మార్కెట్లో సేల్స్ ఎప్పుడు ప్రారంభిస్తార‌న్న సంగ‌తి మాత్రం వెల్ల‌డించ‌లేదు.

డ్యుయ‌ల్ సిమ్ ఆప్ష‌న్ గ‌ల లావా బ్లేజ్‌2 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఔటాఫ్ బాక్స్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ ఒక్టాకోర్ యూనిసోక్ టీ 616 ప్రాసెస‌ర్ ఎస్వోసీ క‌లిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో దీని స్టోరేజీ మెమెరీ పెంచుకోవ‌చ్చు.

లావా బ్లేజ్2 ప్రో ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

లావా బ్లేజ్‌2 ప్రో ఫోన్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ క‌నెక్టివిటీతో వ‌స్తుంది. ఫేస్ అన్ లాక్ ఫీచ‌ర్‌తోపాటు బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఉంటుంది.

First Published:  11 Sep 2023 8:35 AM GMT
Next Story