Telugu Global
Science and Technology

యూపీఐ ఆప్షన్‌తో జియో ఫీచర్ ఫోన్!

ఎవరైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది.

యూపీఐ ఆప్షన్‌తో జియో ఫీచర్ ఫోన్!
X

యూపీఐ ఆప్షన్‌తో జియో ఫీచర్ ఫోన్!

ఎవరైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. అత్యంత తక్కువ ధరకు లభించే ఈ ఫోన్‌లో ఏమేం ఫీచర్లున్నాయంటే..

‘భారత్ బీ1’ పేరుతో రిలయన్స్ జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చీపెస్ట్ 4జీ ఫోన్లలో ఇదీ ఒకటి. ఇప్పటికే అందుబాటులో ఉన్న జియో వీ2, కే1 కార్బన్‌ మోడళ్లతో పోలిస్తే ఇందులో అదనంగా కొన్ని ఫీచర్లు యాడ్ అయ్యాయి.

జియో పాత మోడళ్లతో పోలిస్తే ఇందులో స్క్రీన్ సైజ్ కాస్త ఎక్కువ ఉంటుంది. యూపీఐ పేమెంట్ ఆప్షన్ ఇందులో ప్రత్యేకత. ఫీచర్ల విషయానికొస్తే.. జియో భారత్‌ బీ1 ఫోన్‌లో 2.4 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఉండే 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ.. సుమారు 300 గంటల స్టాండ్ బై టైంను అందిస్తుందని జియో కంపెనీ చెప్తోంది. అలాగే ఇందులో వెనుకవైపు కెమెరాతో పాటు మైక్రోఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్ ఉంది. 128 జీబీ స్టోరేజీ వరకూ ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో 512 ఎంబీ ర్యామ్‌తో పాటు బ్లూటూత్‌, వైఫై, 3.5 ఎంఎం జాక్‌, యూఎస్‌బీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక యాప్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో అన్ని జియో యాప్స్‌ ప్రీ– ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే యాప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 23 భాషల్ని సపోర్ట్‌ చేస్తుంది. అన్ని లోకల్ భాషల్లో ఈ ఫోన్‌ను ఆపరేట్ చేయొచ్చు.

ప్రస్తుతం భారత్‌ బీ1 ఫోన్ ధర రూ.1299గా ఉంది. జియో వెబ్‌సైట్‌ లేదా అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే ఇందులో జియో సిమ్ మాత్రమే వాడుకునే వీలుంది. 4జీ కనెక్టివిటీపై పనిచేస్తుంది.

First Published:  16 Oct 2023 7:00 AM GMT
Next Story