Telugu Global
Science and Technology

ఐకూ నుంచి బ్రాండ్ న్యూ ఫ్లాగ్‌షిప్ ఫోన్! ఫీచర్లివే..

ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది.

ఐకూ నుంచి బ్రాండ్ న్యూ ఫ్లాగ్‌షిప్ ఫోన్! ఫీచర్లివే..
X

చైనాకు చెందిన వివో మొబైల్‌ బ్రాండ్‌కు సబ్ బ్రాండ్ అయిన ఐకూ.. ఫ్లా్గ్‌షిప్ మార్కెట్లో దూసుకుపోతుంది. బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్‌గా పేరు సంపాదించిన ఈ బ్రాండ్ తాజాగా ‘ఐకూ నియో9 ప్రో’ మొబైల్‌ను లాంఛ్ చేసింది. దీని ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో 6.78 ఇంచెస్ 1.5కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేట్‌ని సపోర్ట్ చేస్తుంది. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్ ప్లేకు వెట్‌ టచ్‌ టెక్నాలజీ అనే ఫీచర్ కూడా ఉంది. అంటే తడిచేత్తో ఫోన్‌ను ఆపరేట్‌ చేసినా డిస్‌ప్లే పనిచేస్తుంది.

ఇక కెమెరాల విషయానికొస్తే.. వెనుక 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 920 సెన్సర్‌తో కూడిన ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే 8 ఎంపీ అల్ట్రావైడ్‌ సెకండరీ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ మొబైల్ లో 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక డిజైన్ విషయానికొస్తే.. వెనుక డ్యుయల్ టోన్ లుక్‌తో లెదర్ ఫినిష్‌ కలిగి ఉంది. వెనుక రెండు పెద్ద కెమెరాలు మంచి లుక్‌నిస్తాయి.

ఇక ధరల విషయానికొస్తే.. ఐకూ నియో 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేసిక్‌ వేరియంట్‌ (8జీబీ+128జీబీ) ధర రూ.35,999 ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.37,999, 12జీబీ+256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999 ఉంది. బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో సేల్ మొదలవుతుంది.

First Published:  23 Feb 2024 10:54 AM GMT
Next Story