Telugu Global
Science and Technology

Apple Discounts | ఆపిల్ ఐ-ఫోన్లు, ఐమాక్ లాపీల‌పై ఇలా పండుగ ఆఫ‌ర్లు.. !

Apple Discounts | పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌ పండుగ కూడా మొద‌లైంది.

Apple Discounts | ఆపిల్ ఐ-ఫోన్లు, ఐమాక్ లాపీల‌పై ఇలా పండుగ ఆఫ‌ర్లు.. !
X

Apple Discounts | పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌ పండుగ కూడా మొద‌లైంది. ఈ నెల ఎనిమిదో తేదీ ప‌లు స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు, టాబ్లెట్లు, టీవీలు, ఇయ‌ర్ పాడ్‌లు ఇత‌ర వ‌స్తువుల‌పై విస్తృత శ్రేణి ఆఫ‌ర్లు అందిస్తున్నాయి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌. లీడింగ్ బ్రాండ్ ఆపిల్- ఐఫోన్ల‌పైనా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఐఫోన్‌14 (iPhone 14), ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 12 (iPhone 12)ల‌పై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోన‌స్‌లు అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మ‌హీంద్రా బ్యాంకు నుంచి ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐ-ఫోన్‌14పై ఇలా

ఐఫోన్ 14 ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.69,990 అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.56,999ల‌కు దిగి వ‌చ్చింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల‌పై అద‌న‌పు రాయితీతో రూ.51,999ల‌కే ఐ-ఫోన్ 14 ల‌భిస్తుంది. ఎక్స్చేంజ్ బోన‌స్ కింద రూ.41,150ల‌కే ఐఫోన్ 14 సొంతం చేసుకోవ‌చ్చు. బ్లూ, మిడ్ నైట్‌, ప‌ర్పుల్‌, స్టార్‌లైట్‌, (ప్రొడ‌క్ట్‌) రెడ్‌, ప‌సుపు క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

అమెజాన్‌లో ఇలా ఐ-ఫోన్ 13

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌-2023లో ఐ-ఫోన్ 13 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధ‌ర రూ.59,900 నుంచి రూ.48,999ల‌కు దిగి వ‌చ్చింది. 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.89,900 కాగా, 64,499ల‌కే ల‌భిస్తుంది. ఎక్స్చేంజ్ ఆప్ష‌న్ కింద క‌స్ట‌మ‌ర్లు రూ.50,100 వ‌ర‌కు ధ‌ర త‌గ్గించుకోవ‌చ్చు. బ్లూ, గ్రీన్‌, మిడ్‌నైట్‌, పింక్‌, స్టార్‌లైట్‌, (ప్రొడ‌క్ట్‌) రెడ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుందీ ఫోన్‌.

రూ.37,499ల‌కే ఐ-ఫోన్ 12..

ఐ-ఫోన్ 12 (64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ) ఫోన్ లాంచింగ్ ధ‌ర రూ.79,900. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో భాగంగా రూ.40,999.. సెలెక్టెడ్ బ్యాంక్ ఆఫ‌ర్ల‌తో రూ.37,499ల‌కు దిగి వ‌స్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కింద రూ.24,600 డిస్కౌంట్ అందిస్తుంది. బ్లూ, గ్రీన్‌, బ్లాక్‌, వైట్‌, (ప్రొడ‌క్ట్‌) రెడ్‌, ప‌ర్పుల్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది.

రూ.69,990ల‌కే ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ఎం2

గ‌తేడాది మార్కెట్లో ఆవిష్క‌రించిన ఆపిల్ మాక్ బుక్ ఎయిర్ ఎం2 లాప్‌టాప్ (256 జీబీ స్టోరేజీ వేరియంట్‌) ధ‌ర రూ.1,14,900. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్స్‌లో రూ.69,990ల‌కే ల‌భిస్తుంది.

First Published:  9 Oct 2023 7:15 AM GMT
Next Story