Telugu Global
Science and Technology

త్వరలోనే ఐఓఎస్ 17.. కొత్త ఫీచర్లివే..

సరికొత్త ఐఓఎస్ 17 తో ఐఫోన్ విజువల్‌ లుకప్‌ ఫీచర్‌ మరింత మెరుగవ్వనుంది.

iOS 17 Update: త్వరలోనే ఐఓఎస్ 17.. కొత్త ఫీచర్లివే..
X

iOS 17 Update: త్వరలోనే ఐఓఎస్ 17.. కొత్త ఫీచర్లివే..

రీసెంట్‌గా జరిగిన యాపిల్‌ యాన్యువల్ మీట్‌.. డబ్లూడబ్ల్యూడీసీలో ఐఓఎస్ 17 కు సంబంధించిన కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో రానున్న కొత్త ఫీచర్లేంటంటే..

యాపిల్ ఫోన్స్‌లో ఉండే ఎయిర్‌ట్యాగ్స్‌ను ఇకపై ఐదుగురితో పంచుకోవచ్చు. దీంతో ఫైండ్‌మైలో ఏదైనా వస్తువు ఎక్కడుందో కనుక్కోవటానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా పర్మిషన్ ఉంటుంది.

గూగుల్‌ మ్యాప్స్‌లో ఉండే ఆఫ్‌లైన్‌ మ్యాప్స్ ఫీచర్ ఇప్పుడు యాపిల్ మ్యాప్స్‌లోనూ ఉండబోతోంది. దీంతో ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏయే ప్రదేశాలు, సదుపాయాలున్నాయో తెలుసుకోవచ్చు.

సరికొత్త ఐఓఎస్ 17 తో ఐఫోన్ విజువల్‌ లుకప్‌ ఫీచర్‌ మరింత మెరుగవ్వనుంది. ఫొటోలోంచే కాదు.. పాజ్‌ చేసిన వీడియోల్లోంచి కూడా షాపులు, ప్లేసుల వివరాలు వంటివి తెలుసుకోవచ్చు. ఐఓఎస్ 17 లో కమ్యూనికేషన్‌ సేఫ్టీ ఫీచర్స్ కూడా అప్‌డేట్ అయ్యాయి.

ఐఫోన్‌లోంచి ఐఫోన్‌లోకి కాంటాక్ట్‌ను షేర్‌ చేసుకోవటానికి నేమ్‌డ్రాప్‌ ఫీచర్‌ రానుంది. రెండు ఐఫోన్లను ఒకదాని పక్కన మరోటి పెడితే.. కాంటాక్ట్‌ ఇన్ఫో దానంతటదే ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

ఐఓఎస్‌ 17లో కొత్తగా జర్నల్‌ యాప్‌ ఉండబోతోంది. ఇందులో రోజువారీ పనులు, ఆలోచనలను, జ్ఞాపకాలను రాసుకోవచ్చు. ఫొటోలు, ఆడియో రికార్డింగులు, పాటలు కూడా అటాచ్ చేసుకోవచ్చు.

First Published:  16 Jun 2023 8:18 AM GMT
Next Story