Telugu Global
Science and Technology

ఐఫోన్ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్!

ఐఫోన్లలోని సెక్యూరిటీ గమనిస్తుండే సిటిజన్ ల్యాబ్ గ్రూప్.. తాజాగా ఐఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఐఓఎస్‌లో పెగాసస్‌కు చెందిన స్పైవేర్‌‌ను గుర్తించినట్టు సిటిజన్ ల్యాబ్ పేర్కొంది.

ఐఫోన్ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్!
X

ఐఫోన్ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్!

ఐఫోన్లలోని సెక్యూరిటీ గమనిస్తుండే సిటిజన్ ల్యాబ్ గ్రూప్.. తాజాగా ఐఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఐఓఎస్‌లో పెగాసస్‌కు చెందిన స్పైవేర్‌‌ను గుర్తించినట్టు సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే..

ఐఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ పెగాసస్‌కు చెందిన స్పైవేర్‌ ఐఓఎస్ తో పనిచేసే పలు యాపిల్ డివైజ్‌లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజన్ ల్యాబ్‌ తెలిపింది. ఈ స్పై వేర్ బారిన పడకుండా ఉండాలంటే.. యాపిల్ యూజర్లు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్ చేయాలని కోరింది.

రీసెంట్‌గా వాషింగ్టన్‌కు చెందిన సివిల్ సొసైటీ ఉద్యోగి తన యాపిల్‌డివైజ్ చెక్‌ చేస్తున్నప్పుడు, ఎన్‌ఎస్‌ఓ పెగాససస్‌కు సంబంధించిన స్పైవేర్‌ ద్వారా ఐఓఎస్ బ్రీచ్‌ జరగడం గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఓఎస్ 16.6 వెర్షన్ లో ఈజీగా చొరబడుతున్న మూడు కొత్త వైరస్‌ను కనుగొన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇవి యూజర్‌తో సంబంధం లేకుండానే బ్లాస్ట్‌పాస్‌ చేస్తుందని, ఐమెసేజెస్ నుంచి వక్తిగత వివరాలు, ఫోటోలను దొంగిలిస్తుందని తెలిపింది.

సిటిజెన్ ల్యాబ్ గుర్తించిన లోపాలను సరిచేస్తూ యాపిల్ కొత్త అప్‌డేట్స్‌ను రిలీజ్ చేసింది. యాపిల్ యూజర్లు ఆ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే స్పై వేర్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.

First Published:  10 Sep 2023 5:00 AM GMT
Next Story